బిజినెస్

డి-మార్ట్ జోష్‌తో మారిన దమని రేంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: రిటైల్ వ్యాపార విభాగం డి-మార్ట్ నిర్వహణదారైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్ దమని.. దేశంలోని టాప్-20 ధనవంతుల జాబితాలో చేరారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ల లిస్టింగ్ జరగగా, మదుపరులను అవి విపరీతంగా ఆకట్టుకున్నది తెలిసిందే. తొలిరోజే షేర్ విలువ ఏకంగా 114 శాతానికిపైగా లాభపడింది. దీంతో దమని, ఆయన కుటుంబ సభ్యులు, పెట్టుబడి సంస్థల సంపద విలువ ఒక్కసారిగా ఎగబాకింది. 5.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా భారతీయ టాప్-20 కుబేరుల జాబితాలో 16వ స్థానాన్ని దమని ఆక్రమించగా, అనిల్ అంబానీ, రాహుల్ బజాజ్, అజయ్ పిరామల్, కళానిధి మారన్‌లను వెనక్కినెట్టి పైస్థాయలో నిలిచినట్లైంది. ముకేశ్ అంబానీ మాత్రం ఎప్పట్లాగే 27.6 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారని తాజా ఫోర్బ్స్ జాబితా వివరాలు చెబుతున్నాయ. కాగా, 299 రూపాయల విలువతో స్టాక్ మార్కెట్లలోకి అడుగిడిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్.. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) ట్రేడింగ్ ప్రారంభమయ్యాక 102.14 శాతం వృద్ధితో 604.40 రూపాయలను తాకింది. ముగిసే సమయానికి 114.29 శాతం లాభంతో 640.75 రూపాయల వద్ద స్థిరపడింది. ఒక దశలోనైతే 117.39 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 650 రూపాయలకు చేరింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో 114.58 శాతం లాభంతో 641.60 రూపాయల వద్ద ముగిసింది. ఈ క్రమంలోనే దమని సంపద విలువ 5 బిలియన్ డాలర్లను దాటగా, ఇందులో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ల లాభాలతో వచ్చినదే 2.4 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. ఈ నెల ఆరంభంలో వచ్చిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఐపిఒ.. 104 రెట్లకుపైగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. 8-10 తేదీల్లో ముందుకొచ్చిన ఈ పబ్లిక్ ఇష్యూలో 295-299 రూపాయల ధరల శ్రేణితో 145.67 లక్షల షేర్లను దమని అమ్మకానికి పెట్టారు. మదుపరుల విశేష స్పందనతో 299 రూపాయల గరిష్ఠ ధరకు స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాయి అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు. భారీ కొనుగోళ్లతో అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్ విలువ 39,988.21 కోట్ల రూపాయలకు చేరగా, మార్కెట్‌లో డి-మార్ట్‌కు ప్రధాన పోటీదారైన ఫ్యూచర్ రిటైల్ మార్కెట్ విలువ 11,674.84 కోట్ల రూపాయలుగానే ఉంది. కాగా, నిరుడు అక్టోబర్‌లో నమోదైన 3,000 కోట్ల రూపాయల విలువైన పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఒ తర్వాత వచ్చిన అతిపెద్ద ఐపిఒ అవెన్యూ సూపర్‌మార్ట్సే. నిరుడు వచ్చిన ఐపిఒల్లో అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ ఐపిఒ 116 రెట్లు, క్వెస్ కార్ప్ 145 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఒ కూడా 104 రెట్లకుపైగా సబ్‌స్క్రైబ్ అయ్యంది. అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ నేతృత్వంలో నడుస్తున్న డి-మార్ట్‌కు హైదరాబాద్‌తోపాటు ముంబయ, అహ్మదాబాద్, బరోడా, బెంగళూరు, పుణె, సూరత్‌లలో స్టోర్లున్నాయ.

318 పాయంట్లు కోల్పోయన సెనె్సక్స్
ముంబయి, మార్చి 22: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న బలహీన సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో గత రెండు రోజుల నష్టాలను కొనసాగిస్తూ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లోనూ నేల చూపులు చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 317.77 పాయింట్లు క్షీణించి 29,167.68 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 91.05 పాయింట్లు పతనమై 9,030.45 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు నష్టపోగా, ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు నష్టాల్లోనే కదలాడాయి.
విత్తన భాండాగారం చేస్తాం
విదేశీ బృందంతో తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 22: విత్తన ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సుమారు 2 లక్షల మంది రైతులు 2,50,000 ఎకరాల్లో విత్తనోత్పత్తి పంటలను పండిస్తున్నారని తెలిపారు. బుధవారం ఇథియోపియా దేశానికి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం మంత్రిని కలిసింది. తెలంగాణలో విత్తనోత్పత్తి విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం హాజరైంది. ఈ బృందంతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని 400 సంస్థలు దేశ విత్తన అవసరాలను 60 శాతానికిపైగా తీరుస్తున్నాయన్నారు. యేటా 50 వేల మంది రైతులకు సీడ్ విలేజ్ ప్రోగ్రాం ద్వారా ఫౌండేషన్ సీడ్‌ను సరఫరా చేసి, తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీ ద్వారా సరఫరా చేస్తోందన్నారు. కాగా, విదేశీ బృందాన్ని మంత్రి శాలువాతో కప్పి, మెమొంటోతో సత్కరించారు.