బిజినెస్

నిలకడగా మిర్చి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 25: ‘పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మిర్చ్ధిర నిలకడగానే ఉంది.’ అని ఏపి మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. ఆంధ్రభూమితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ నిరుడు అత్యధికంగా ధర పలికిందని దీన్నిబట్టి కొందరు రైతులు ధర పెరిగిందని అపోహ పడుతున్నారన్నారు. కానీ కర్నాటక, మహారాష్టల్రో సంక్షోభం దృష్ట్యా రాష్ట్రంలో మిర్చికి గిరాకీ పెరిగిందని, ఇదే ధర కొనసాగింపు కాదన్నారు. అంతకు ముందు పదేళ్లుగా ఒకే రకమైన ధరకు కొనుగోలు చేశారన్న ఆయన మిర్చి ధరపై విశే్లషణ జరుపుతున్నామని, ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, మార్కెటింగ్ సొసైటీ చెక్‌పోస్టులను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రస్తుతం 486 చెక్‌పోస్టులు ఉన్నాయని, అయతే వంద ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు, సౌకర్యాలతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. కానీ నిర్మాణ సంస్థలు ఎక్కువ ధర కోట్ చేస్తున్నందున ఈ ప్రతిపాదనపై పునరాలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇక చెక్‌పోస్టుల ద్వారా 470 కోట్ల రూపాయల మార్కెటింగ్ సెస్ వసూలు లక్ష్యంగా పెట్టుకున్నామని, అయతే ఇప్పటివరకు 415 కోట్ల రూపాయలు వసూలు చేశామన్నారు. మార్కెట్ యార్డులలో రైతుల సౌలభ్యం కోసం ఫంక్షనల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం 80 యార్డులలో ఈ సదుపాయం ఉందన్నారు. కొత్తగా మరో 19 ఏర్పాటు చేయాలనే యోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా మార్కెట్ యార్డులకు సంబంధించి 1,050 గోడౌన్లు ఉన్నాయని సామర్థ్యం పెంపుపై దృష్టి సారించామని వెల్లడించారు. ఏడాది క్రితం 55 శాతం నిల్వ చేసేవారని ఇప్పుడు 77 శాతానికి పెరిగిందన్నారు. ఉద్యానవన పంటలైన మామిడి, అరటి నిల్వకు ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 37 యంత్రాల ద్వారా 65 టన్నుల మేర అరటి, మామిడి నిల్వ చేయగలిగామన్నారు. రాష్ట్రంలోని రైతు బజార్లలో సదుపాయాల కల్పన, ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని, ఎస్టేట్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కృష్ణాజిల్లా తిరువూరు, గుంటూరు జిల్లా పొన్నూరు, విజయనగరం జిల్లాల్లో కొత్తగా 7 రైతు బజార్లను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మరో 33 రైతు మార్కెట్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇవికూడా పూర్తయితే రాష్టవ్య్రాప్తంగా 120 రైతు బజార్ల ద్వారా సేవలందించే వీలు కలుగుతుందన్నారు.

నాలుగు స్టార్టప్స్‌కు
గ్లోబల్ అవార్డులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ టి హబ్‌లో భాగమైన నాలుగు భారతీయ టాప్ స్టార్టప్స్‌కు గ్లోబల్ అవార్డులు లభించాయి. హగ్ ఇన్నోవేషన్స్, లూప్ రియాలిటీ, ఆత్ బేస్, ఖ్యేతి స్టార్టప్స్‌కు ఈ అవార్డులు లభించినట్లు టి హబ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలో జరిగిన ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో పాల్గొన్న హగ్ ఇన్నోవేషన్స్, లూప్ రియాలిటీకి అవార్డులు లభించగా, ఖ్యాతి స్టార్టప్‌కు కెన్యాలో ‘అక్యుమెన్ గ్లోబల్ అవార్డు 2017’ లభించింది. ఆత్‌బేస్ స్టార్టప్ కూడా రేస్ టు గ్రేస్ 2017 అవార్డు సొంతం చేసుకుందని టి హబ్ ప్రకటించింది. హగ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్ ఫ్లయింగ్ డ్రోన్స్, నావిగేటింగ్ స్మార్ట్ టెలివిజన్ తయారు చేస్తుండగా, జిమ్స్, హెల్త్ క్లబ్స్ వంటి వాటికి ఇండోర్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ సేవలను లూప్‌రియాలిటీ అందిస్తోంది. ఖ్యాతి స్టార్టప్ పేద వ్యవసాయ కార్మికులకు తక్కువ ధరకు ఫార్మింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఇక ఆత్ బేస్ కంపెనీ టి హబ్‌లో భాగంగా సైబర్ సెక్యూరిటీ కంపెనీగా పని చేస్తూ డెవలెపర్స్‌కు వారి అప్లికేషన్స్‌కు అవసరమైన భద్రత, హేక్ కాకుండా చేపట్టే సైబర్ సెక్యూరిటీ సేవలను సమకూరుస్తోంది.
డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్‌లో
ఎఫ్‌డిఎ తనిఖీలకు రంగం సిద్ధం!
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 25: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్‌లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్‌ఎఫ్‌డిఎ) తనిఖీలు మొదలుకానున్నాయి. సంస్థకు చాలా కీలకమైన శ్రీకాకుళం ప్లాంట్‌లో యుఎస్‌ఎఫ్‌డిఎ ఈ నెల 27 నుంచి తనిఖీలు చేపట్టనుండగా, అమెరికా నుంచి బృందం రానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ శ్రీకాకుళం జిల్లాలోగల రెడ్డీస్ ప్లాంట్‌కు ఫాక్స్ పంపినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం మిర్యాలగూడ ప్లాంట్‌లో తనిఖీలు చేపట్టిన యుఎస్‌ఎఫ్‌డిఎ.. మూడు లోపాలు నమోదు చేసింది. ఇక విశాఖపట్నానికి దగ్గరలోగల దువ్వాడ ప్లాంట్ తనిఖీల్లో భాగంగా 13 లోపాలను గుర్తించింది. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా ప్లాంటులోనూ తనిఖీలు చేపట్టనుంది. 2015 నవంబరులో ఈ మూడు ప్లాంట్లపైనా యుఎస్‌ఎఫ్‌డిఎ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ డ్రగ్ మేకర్ చిక్కుల్లో పడినది తెలిసిందే. కాగా, కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ మూడు ప్లాంట్ల వాటా 10-12 శాతంగా ఉంది. గతంలో జరిగిన తనిఖీల సందర్భంగా మదుపరుల సెంటిమెంట్ దెబ్బతిని దాదాపు 4 శాతానికిపైగా నష్టపోయి 50 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది రెడ్డీస్ షేర్ల విలువ. ఇప్పుడు శ్రీకాకుళం ప్లాంట్ తనిఖీలోనూ లోపాలు తేలితే స్టాక్ మార్కెట్‌లో మరింత నష్టాలను చవిచూడాల్సి ఉంటుందన్న ఆందోళన మదుపరులు వ్యక్తం చేస్తున్నారు.
వచ్చేవారమంతా పనిచేయాలి
ౄ బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశం
ౄ వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు
న్యూఢిల్లీ, మార్చి 25: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ముగుస్తున్న క్రమంలో పన్ను చెల్లింపులకు ఆటంకం కలగకుండా వచ్చేవారం మొత్తం సెలవుల్లేకుండా పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులను ఆదేశించింది. ఏప్రిల్ 1 వరకు తెరిచే ఉంచాలని స్పష్టం చేసింది. అయితే ఆర్‌బిఐ నిర్ణయంపై బ్యాంక్ అధికారుల సంఘం ఎఐబిఒసి అభ్యంతరం వ్యక్తం చేసింది. వచ్చే వారం పూర్తిగా నాలుగు పనిదినాలున్నాయని, పన్ను చెల్లింపులకు ఇవి చాలని అంటోంది.

సిఐఐ సదరన్ రీజియన్
చైర్మన్‌గా విక్రమ్ కిర్లోస్కర్
డిప్యూటీ చైర్మన్‌గా ఆర్ దినేశ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 25: భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) దక్షిణాది ప్రాంతీయ చైర్మన్‌గా విక్రమ్ కిర్లోస్కర్ వచ్చే నెల నుంచి మొదలయ్యే 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఎన్నికయ్యారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో సిఐఐ దక్షిణ ప్రాంతీయ విభాగానికి ఈయన డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. కిర్లోస్కర్ గతంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌కు (సియామ్) ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. కాగా, దక్షిణాది ప్రాంతీయ డిప్యూటీ చైర్మన్‌గా ఆర్ దినేశ్ ఎన్నికయ్యారు. టివి సుందరమ్ అయ్యంగార్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా దినేశ్ పని చేస్తున్నారు.