బిజినెస్

దేశీయ అత్యంత విశ్వసనీయ బ్రాండ్ సామ్‌సంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 5: భారతీయ మార్కెట్‌లో

అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో దక్షిణ

కొరియాకు చెందిన కన్జ్యూమర్ డ్యూరబుల్స్ దిగ్గజం

సామ్‌సంగ్ అగ్రస్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన

బహుళ వ్యాపార దిగ్గజం సోనీ, దక్షిణ కొరియాకే

చెందిన బహుళజాతి సంస్థ ఎల్‌జి వరుసగా రెండు,

మూడు స్థానాలను దక్కించుకున్నాయి. టాప్-5

బ్రాండ్లలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ సంస్థ

టాటా గ్రూప్ మాత్రమే కావడం గమనార్హం. ‘ది బ్రాండ్

ట్రస్ట్ రిపోర్ట్-2017’ పేరిట విడుదలైన తాజా గణాంకాల

ప్రకారం నిరుడు (2016)తో పోల్చితే సామ్‌సంగ్

ఏకంగా 17 స్థానాలు మెరుగుపడి ఈసారి ప్రథమ

స్థానానికి ఎగబాకడం విశేషం. మరోవైపు క్రిందటిసారి

మొదట నిలిచిన సామ్‌సంగ్ మొబైల్స్ తాజా

జాబితాలో 154 స్థానాలకు దిగజారడం గమనార్హం.

సోనీ, ఎల్‌జి మాత్రం యథాతథంగా ఉన్నాయి.

ఇదిలావుంటే ఈసారి నివేదికలో అమెరికా ఆధారిత

ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ నాలుగో

స్థానంలో ఉండగా, దేశీయ బహుళ వ్యాపార దిగ్గజం

టాటా గ్రూప్ ఐదో స్థానంలో నిలిచింది. జపాన్‌కు

చెందిన ఆటోరంగ దిగ్గజం హోండా ఆరో స్థానంలో,

భారతీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి ఏడో

స్థానంలో ఉన్నాయి. నిరుడుతో పోల్చితే మారుతి

సుజుకి నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుంది.

కాగా, అమెరికా టెక్నాలజీ దిగ్గజం, కంప్యూటర్లు,

ల్యాప్‌టాప్‌ల తయారీదారైన డెల్ ఎనిమిదో స్థానంలో,

చైనీస్-అమెరికన్ బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం

లెనోవో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. నిరుడు ఇది

27వ స్థానంలో ఉంది. ఇక దేశీయ బహుళ వ్యాపార

సంస్థ బజాజ్ పదో స్థానంతో సరిపెట్టుకుంది. నిరుడు

ఏడో స్థానంలో ఉందిది. 2016తో చూస్తే 2017

జాబితాలో టాప్-10 నుంచి నాలుగు సంస్థలు

వైదొలిగాయి. వీటిలో సామ్‌సంగ్ మొబైల్స్, నోకియా,

గోద్రెజ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయని టిఆర్‌ఎ

రిసెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) ఎన్

చంద్రవౌళి తెలిపారు. దేశవ్యాప్తంగా 16 నగరాల్లో

నిర్వహించిన అధ్యయనంలో 2,500లకుపైగా

సంస్థలపై వినియోగదారుల నుంచి అభిప్రాయ

సేకరణ జరిగింది. దీని ఆధారంగానే తాజా నివేదిక

రూపొందింది.