బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ‘సిరియా’ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సిరియాపై అమెరికా వైమానిక దాడుల ప్రభావం మొత్తం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో పౌరులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో మృతి చెందడంపై కలత చెందే ఈ వైమానిక దాడులకు దిగినట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినది తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి. ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 220.73 పాయింట్లు పతనమై 29,706.61 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 63.65 పాయింట్లు కోల్పోయి 9,198.30 వద్ద నిలిచింది. గురువారం కూడా సూచీలు నష్టాలకే పరిమితమైనది తెలిసిందే.
కాగా, శుక్రవారం ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, సింగపూర్, తైవాన్ సూచీలు నష్టపోగా, జపాన్ సూచీ మాత్రం లాభపడింది. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నష్టపోయాయి. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 86.11 పాయింట్లు, నిఫ్టీ 24.55 పాయింట్లు పెరిగాయి. గత వారం కూడా సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ
రూ. 9,559 కోట్లు ఆవిరి
టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో మూడు నెలల ‘కాంప్లిమెంటరీ’ ఆఫర్ సభ్యత్వ గడువును వారం రోజుల ముందే రిలయన్స్ జియో ఉపసంహరించుకోవడంతో శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ బిఎస్‌ఇలో 2.28 శాతం మేర పడిపోయి 1,405.55 రూపాయలకు, ఎన్‌ఎస్‌ఇలో 2.21 శాతం దిగజారి 1,406.60 రూపాయలకు పడిపోయింది. దీంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 9,558.77 కోట్ల రూపాయలు క్షీణించి 4,56,983.23 కోట్ల రూపాయలకు తగ్గింది.
రూ. 5,004 కోట్లు తగ్గిన
సన్ ఫార్మా మార్కెట్ విలువ
దేశీయ ఔషధరంగ దిగ్గజం సన్ ఫార్మా మార్కెట్ విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో 5,004.17 కోట్ల రూపాయలు పతనమైంది. సంస్థకు చెందిన ప్లాంట్లలో ఒకదానిలో యుఎస్‌ఎఫ్‌డిఎ సోదాలు జరిగాయన్న వార్తల మధ్య సన్ ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
దీంతో బిఎస్‌ఇలో 3.04 శాతం పడిపోయిన 665.65 రూపాయల వద్ద నిలిచిన సన్ ఫార్మా షేర్ విలువ.. ఎన్‌ఎస్‌ఇలో 3 శాతం కోల్పోయి 665.95 రూపాయల వద్ద నిలిచింది. ఫలితంగా సంస్థ మార్కెట్ విలువ 1,59,704.83 కోట్ల రూపాయలకు దిగజారింది.