బిజినెస్

ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ ఆధారిత సెట్ టాప్ బాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారతీ ఎయిర్‌టెల్ డిటిహెచ్ విభాగమైన ఎయిర్‌టెల్ డిజిటల్ టివి.. బుధవారం ఓ ఆండ్రాయిడ్ ఆధారిత సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టిబి)ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సాధారణంగా వచ్చే శాటిలైట్ చానళ్లతోపాటు ఈ ఎస్‌టిబి ద్వారా టెలివిజన్‌లో ఆన్‌లైన్ (ఇంటర్నెట్‌లోని) కార్యక్రమాలనూ చూడవచ్చు. యూట్యూబ్ అనుసంధానిత నెట్‌ఫ్లిక్స్ మూవీ అప్లికేషన్‌తో ప్రీ-లోడ్ చేసిన ఈ ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ఎస్‌టిబి ధర కొత్త కస్టమర్లకు 4,999 రూపాయలని సంస్థ తెలియజేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వినియోగదారులు ఈ మూవీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. మూడు నెలలపాటు టెలివిజన్‌పై గేమ్స్‌ను కూడా ప్లే చేసుకోవచ్చంది. భారతీయుల అవసరాలు, అలవాట్లను దృష్టిలో పెట్టుకుని దీన్ని తెచ్చామని 20 మిలియన్ల నాన్-స్మార్ట్ టీవీ సెట్ల వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకున్నామని భారతీ ఎయిర్‌టెల్ సిఇఒ, డిటిహె చ్ డైరెక్టర్ సునీల్ తల్దార్ అన్నారు. కాగా, కొత్త కస్టమర్లకు ఎయిర్‌టెల్ డిటిహెచ్‌పై దాదాపు 500 చానళ్లకు ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నామని, 7,999 రూపాయలకు దీన్ని పొందవచ్చన్నారు. ఇప్పటికే ఉన్న కస్టమర్లకైతే నెల రోజుల సబ్‌స్క్రిప్షన్‌కు 3,999 రూపాయలు చెల్లిస్తే చాలన్నారు.