బిజినెస్

క్రయవిక్రయాలు, చెల్లింపులు చకచకా జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: దేశంలోనే రికార్డు స్థాయిలో ఈసారి తెలంగాణలో యాసంగి సీజన్ ధాన్యం పండింది. దాదాపు 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా యాసంగిలో రికార్డు స్థాయిలో 21 లక్షల 64 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దీంతో భూమికి బరువయ్యేంత బంపర్ దిగుబడి వచ్చిందని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. యాసంగి సీజన్లో వచ్చే వరి ధాన్యం సేకరణ కోసం శనివారం ముగ్గురు మంత్రులు సచివాలయం నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు దిశా-నిర్దేశం చేశారు. భారీ స్థాయిలో ధాన్యం మార్కెట్లకు వస్తున్నందున రైతులకు కనీస మద్దతు ధర కన్నా తక్కువ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంస్థలు వెంటనే కొనుగోలు ప్రారంభించాలనీ ఆదేశించారు. అంతేగాక తగిన చొరవ చూపించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్తు చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన రైతు తన పంటను 24 గంటల్లో అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని, 48 గంటల్లో వారికి చెల్లింపులు జరగాలని తేల్చిచెప్పారు. చెల్లింపులలో ఎలాంటి జాప్యం జరగరాదన్నారు. కాగా, కందుల కొనుగోలులో రైతులకు ఇంకా 150 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నామని, మూడు రోజుల్లో ఆ చెల్లింపులు పూర్తి చేయాలని హరీశ్‌రావు అధికారులకు చెప్పారు. ధాన్యం చెల్లింపుల్లో ఆలస్యం జరగరాదన్నారు. ఈసారి నిజాంసాగర్, సింగూరు, నాగార్జున సాగర్, తదితర ప్రాజెక్టులతోపాటు మధ్యతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెరువుల ద్వారా యాసంగికి సాగునీరు పుష్కలంగా అందిందని, అందుకే ఎకరాకు 35 క్వింటాళ్లకుపైగా ధాన్యం రానుందని చెప్పారు. సూర్యాపేట, బాన్సువాడ వంటి ప్రాంతాల్లో వరి ధాన్యం ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని, అక్కడ స్పెషల్ ఆఫీసర్లను నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ముగ్గురు మంత్రులు సూచించారు. మండల స్థాయి నుంచి అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్లు ప్రతి రోజు ఉదయం ఒక గంట సేపు ధాన్యం సేకరణ పరిస్థితిని సమీక్షించాలని కూడా మంత్రులు ఆదేశించారు. అదే విధంగా ధాన్యం విక్రయాల్లో రీ సైక్లింగ్ జరగకుండా చూడాలని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, పౌరసరఫరాలు, ఎఫ్‌సిఐ తదితర సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.