బిజినెస్

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 17.47 పాయింట్లు పెరిగి 29,336.57 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 1.65 పాయింట్లు పడిపోయి 9,103.50 వద్ద నిలిచింది.
టిసిఎస్ షేర్లు పతనం
న్యూఢిల్లీ: మరోవైపు దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) షేర్ల విలువ క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను మంగళవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా లేకపోవడమే కారణం. మంగళవారం ముగింపుతో చూస్తే బిఎస్‌ఇలో 0.30 శాతం పడిపోయి 2,301.75 వద్ద నిలిచిన టిసిఎస్ షేర్ విలువ.. ఎన్‌ఎస్‌ఇలో 0.41 శాతం దిగజారి 2,299.15 వద్ద స్థిరపడింది. ఫలితంగా సంస్థ మార్కెట్ విలువ 1,359.6 కోట్ల రూపాయలు పతనమై 4,53,543.25 కోట్ల రూపాయలకు చేరింది.
నాల్కో షేర్లకు విశేష స్పందన
ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో పెట్టుబడుల ఉపసంహరణకు వచ్చిన తొలి ప్రభుత్వరంగ సంస్థ నాల్కో.. షేర్ల విక్రయానికి మదుపరుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బుధవారం సంస్థాగత మదుపరులు, హెచ్‌ఎన్‌ఐల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రాగా, ఇష్యూ తొలిరోజే 954 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. నాల్కోలో కేంద్ర ప్రభుత్వానికి 74.58 శాతం వాటా ఉండగా, 5 శాతం అమ్ముతోంది. గురువారం కూడా విక్రయం జరుగుతుంది.