బిజినెస్

తపాలా ఖాతాల వైపు జనం చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 23: ఖాతాదారులకు ఎన్నో విశిష్ఠమైన సేవలు అందిస్తున్నామని చెప్పుకుంటున్న బ్యాంకులు.. ఏప్రిల్ 1 నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో తపాలా శాఖ వైపు ప్రజలు చూస్తున్నారు. తపాలా శాఖ కూడా బ్యాంకుల తరహాలో ఎటిఎం కార్డులు అందిస్తుండటంతో ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోని వారంతా కూడా తాజా బ్యాంకుల వాతలతో మెల్లగా తపాలా ఖాతాల వైపు మళ్లుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మరోపక్క బ్యాంకులు అనుసరిస్తున్న వైఖరితో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది తెలిసిందే. ముఖ్యంగా కనీస నిల్వ నగదు లావాదేవీలపై పరిమితులు సరికొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగం అన్న తేడా లేకుండా అన్ని బ్యాంకులు ఖాతాదారులపై అదనపు రుసుములు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతీ బ్యాంకు ఖాతాకు పాన్‌కార్డు తప్పనిసరి చేయడంతో చాలామంది బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాలకు మంగళం పలికేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదనపు ఛార్జీల మోత ఎటువంటి ప్రభావం చూపుతుందోనని బ్యాంకింగ్ వర్గాలు కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక సరికొత్త నిబంధనల విషయానికివస్తే పొదుపు ఖాతాల్లో మూడుసార్లకు మించి డిపాజిట్లు చేస్తే ప్రతీసారికి రూ. 50 సేవా రుసుము చెల్లించాలి. ఖాతాల్లో కనీస నిల్వ మెట్రో నగరాల్లో రూ. 5000, నగరాల్లో రూ. 3000, మున్సిపాల్టీలో రూ. 2000, గ్రామాల్లో కనీసం రూ. 1000 ఉండాల్సిందేనని ఎస్‌బిఐ స్పష్టం చేసింది. కనీస నిల్వ లేకుంటే జరిమానాలు తప్పవు. ఎటిఎం కార్డు వినియోగం పరిమితి దాటినా అపరాధ రుసుములే. దీంతో సామాన్య ఖాతాదారులకు చాలా ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటికే ఎస్‌ఎంఎస్, ఎటిఎం, ఆన్‌లైన్ లావాదేవీలు తదితర సేవలు ఉచితం అని ప్రకటించిన బ్యాంకులు ఇప్పుడు వాటి నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తున్నాయి.
రూ. 50కే ఖాతా.. ఎటిఎం కార్డు!
తపాలా శాఖ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 10,323 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 59 ప్రధాన తంతి కార్యాలయాలు, 1,525 సబ్-పోస్ట్ఫాసులు, 8,739 బ్రాంచి కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో అన్ని హెడ్ పోస్ట్ఫాసుల్లో ఎటిఎం కేంద్రాలను ప్రారంభించారు. మొత్తం ఎపి సర్కిల్ పరిధిలో సుమారు 3 లక్షల మంది ఖాతాదారులు తపాలా శాఖకు ఉన్నారు. నిత్యం సుమారు రూ. వెయ్యి కోట్లు లావాదేవీలు ఈ శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ కేవలం రూ. 50తో ఖాతా తెరవడంతోపాటు ఎటిఎం కార్డు ఉచితంగా అందజేస్తున్నారు. కనీస నగదు నిల్వలపై ఎటువంటి నిబంధనలులేవు. జాతీయ బ్యాంకుల మాదిరిగా తపాలా ఖాతాల్లోని నగదు నిల్వకు ఏడాదికి 4 శాతం వడ్డీ కూడా జమవుతోంది. ఏప్రిల్ 1 తర్వాత చాలామంది తపాలా కార్యాలయాల్లో ఖాతాలను తెరవడం ప్రారంభించడం గమనార్హం.