బిజినెస్

ఎపి జెన్కో చొరవతో గట్టెక్కిన మినీ హైడల్ ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటమామిడిలో ఉత్పత్తి పునఃప్రారంభం
శరవేగంగా ‘పింజరకొండ’ పనులు
త్వరలో మిట్లపాలెం నిర్మాణం

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: తూర్పు కనుమల్లో ఏలేరు వాగుపై ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యుత్ సంస్థ (ఎపి ట్రిబ్కో) చేపట్టిన మినీ హైడల్ ప్రాజెక్టులు ఎపి జెన్కో చొరవతో బాలారిష్టాలు అధిగమించి గాడినపడ్డాయి. ఇప్పటికే పూర్తయిన వేటమామిడి మినీ హైడల్ ప్రాజెక్టులో ఎపి జెన్కో సారథ్యంలో ఉత్పత్తి పునఃప్రారంభమైంది. మిగిలిన రెండు ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయి. ఎపి ట్రిబ్కో ఆధ్వర్యంలో చిన్నతరహా విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు దశాబ్దాల క్రితం చేపట్టారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో అడ్డతీగల మండలం పింజరకొండ, వేటమామిడి, మిట్లపాలెంలో చిన్నతరహా జల విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కోటి 1.2 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఈ మూడు ప్రాజెక్టులను రూపొందించారు. వాస్తవానికి తూర్పు కనుమల ఏజెన్సీలో మొత్తం 100 ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లు నిర్మించాలని గుర్తించారు. అందులో భాగంగా మొదటగా మూడు ప్లాంట్లను చేపట్టారు. ఇందులో వేటమామిడి ప్రాజెక్టు ఒకటే.. ఇప్పటిదాకా నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ఆరంభించింది. మిగిలిన రెండు ప్రాజెక్టులు పూర్తికాలేదు. పూర్తయిన వేటమామిడి ప్రాజెక్టును మార్గదర్శకాల ప్రకారం స్థానిక గ్రామ సర్పంచ్, మరో పది మంది స్థానిక గిరిజనులు ప్రాజెక్టు కమిటీగా నిర్వహించాల్సి వుంది.
ఉత్పత్తయిన విద్యుత్‌ను ఎపి ఇపిడిసిఎల్‌కు విక్రయించి ఆ విద్యుత్‌ను స్థానిక ఏజెన్సీ ప్రాంతానికి వినియోగించాల్సి వుంది. వచ్చిన ఆదాయాన్ని ప్లాంట్ కలిగిన గ్రామానికి 50 శాతం, మిగిలిన 50 శాతం ప్లాంట్ కలిగిన మండలానికి దామాషా ప్రకారం కేటాయించాల్సి వుంది. ఈ ప్లాంట్లలో స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు అవకాశం కల్పించాల్సి వుంది. ఈ మేరకు మొత్తంగా ఈ విద్యుదుత్పత్తి పథకాల ద్వారా గిరిజనం సామాజిక అభివృద్ధికి దోహదపడటం ప్రధాన లక్ష్యంగా రూపొందించారు. ఈ మూడు ప్లాంట్లను ఏలేరు వాగుపై నిర్మాణం చేపట్టారు. కాగా, పింజరకొండ, మిట్లపాలెం ప్రాజెక్టులను నిర్మించలేక ఎపి ట్రిబ్కో చేతులెత్తేసింది. వేటమామిడి ప్రాజెక్టును కూడా నిర్వహించలేని స్థితిలో 2015లో ఒప్పందం ప్రకారం వీటిని ఎపి జెన్కో స్వాధీనం చేసుకుంది. దీంతో వేటమామిడి ప్రాజెక్టు నిర్వహణతోపాటు మిట్లపాలెం, పింజరకొండ ప్రాజెక్టుల నిర్మాణం ఎపి జెన్కో చేపట్టింది. అయితే అప్పటివరకు ఎపి ట్రిబ్కో (2011-2015) 23 లక్షల 28 యూనిట్లు ఉత్పత్తి చేసింది. దీని విలువ రూ. 56 లక్షలు. అయితే ఈ ప్రాజెక్టు ఉత్పత్తికి ఎపి ఇపిడిసిఎల్ ఇచ్చిన బిల్లు రూ. 60.98 లక్షలయ్యింది. దీనిపై ఎపి ట్రిబ్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎపి జెన్కో చీఫ్ ఇంజనీర్ కె రత్నబాబు ఆధ్వర్యంలో చర్చలు జరిపారు.
అయితే ఎపి ఇపిడిసిఎల్ సంస్థతో ఈ మూడు ప్లాంట్లకు 200 కెవి విద్యుత్ సరఫరా కనెక్షన్‌కు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఈ మూడు ప్రాజెక్టులు పూర్తికాకపోయినప్పటికీ తీసుకున్న కనెక్షన్ లోడును బట్టి బిల్లులు వేయడంవల్ల తడిసిమోపెడైంది. అయితే చీఫ్ ఇంజనీర్ రత్నబాబు చర్చలు జరిపి ఎపి ఇపిడిసిఎల్ నుంచి తిరిగి ఎపి జెన్కోకు రూ. 1.4 కోట్లు ఇచ్చేవిధంగా ఒప్పందం కుదిర్చారు. దీంతో వచ్చిన ఈ నిధులతోపాటు ఇతరత్రా నిధులు సమీకరించుకుని ఎపి జెన్కో ఈ మూడు ప్రాజెక్టుల బాధ్యతలు చేపట్టింది. ఈ మేరకు ప్రస్తుతం పింజరకొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిట్లపాలెం పనులు ప్రారంభించడానికి ఇటీవల ఎపి జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొలగాని వివిఎస్ మూర్తి ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ రత్నబాబు ప్రాజెక్టు ప్రాంతాలను పర్యటించి పనులను సమీక్షించారు. కాగా, పింజరకొండ ప్రాజెక్టును అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నామని, మిట్లపాలెం ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని ఎపి జెన్కో పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ స్కీమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మూర్తి తెలిపారు.

మూడు కొత్త మార్గాల్లో
ట్రూజెట్ విమానాలు
హైదరాబాద్, ఏప్రిల్ 25: హైదరాబాద్ ఆధారిత ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్.. గురువారం నుంచి మూడు కొత్త మార్గాల్లో విమాన సేవలను ప్రారంభించనుంది. ఉడాన్ పథకంలో భాగంగా ఈ సేవలను మొదలుపెడుతున్నట్లు మంగళవారం ట్రూజెట్ ఓ ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్-కడప, హైదరాబాద్-నాందేడ్, నాందేడ్-ముంబయి మార్గాల్లో గురువారం నుంచి ట్రూజెట్ విమానాలు నడవనున్నాయి. కాగా, ఉడాన్ పథకంలో భాగంగా దేశంలోని 128 మార్గాల్లో కొత్తగా విమాన సేవలను ప్రారంభించేందుకు ఐదు సంస్థలు ముందుకురాగా, అందులో ట్రూజెట్ ఒకటి. ఉడాన్ పథకంలో తొలి విమానాన్ని గురువారం షిమ్లా-్ఢల్లీ మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ ఈ విమానాన్ని నడుపుతుంది. దేశీయంగా విమాన సేవలు అందని ప్రాంతాలకు ఉడాన్ పథకంతో ఆ సౌకర్యాన్ని తెస్తున్నారు.