బిజినెస్

ఇకపై ఒకే లైసెన్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 26: మార్కెట్ నియంత్రిత వ్యవస్థ సెబీ.. బుధవారం బ్రోకర్లకు, క్లియరింగ్ సభ్యులకు కలిపి ఒకే లైసెన్సును ఇవ్వాలని నిర్ణయించింది. సెబీ బోర్డు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లతోపాటు కమాడిటీ డెరివేటివ్‌లలో నిర్వహణకు ఈ లైసెన్సు అనుమతిస్తుంది. సెక్యూరిటీస్ మార్కెట్లలో లావాదేవీలు జరిపే బ్రోకర్ లేదా క్లియరింగ్ సభ్యుడికి ప్రత్యేకంగా ఓ సంస్థ లేకుండానే కమాడిటీ డెరివేటివ్‌లలోనూ కొనుగోళ్లు, అమ్మకాలు లేదా డీలింగ్స్ జరిపే వెసులుబాటు ఈ ఒకే లైసెన్సు విధానంతో కలిగింది. దీంతో సెబీ తీసుకున్న ఈ నిర్ణయంపై కమాడిటీ ఎక్స్‌చేంజ్‌ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ కమాడిటీ మార్కెట్లకు ఈ నిర్ణయం నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని ఎమ్‌సిఎక్స్ ఎండి, సిఇఒ మ్రుగంక్ పరంజపి అన్నారు. కాగా, కమాడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్‌నూ సెబీ అనుమతించింది. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ పరిచయమైన డిజిటల్ వాలెట్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లకూ మదుపరులకు అనుమతినిచ్చింది సెబీ. 50,000 రూపాయల వరకు విలువైన మ్యూచువల్ ఫండ్స్‌ను కొనేందుకు అవకాశమిచ్చింది. ఇదిలావుంటే కార్పొరేట్ బాండ్ మార్కెట్ బలోపేతానికి కొత్త విధివిధానాలకూ సెబీ ఆమోదం తెలిపింది. క్యాపిటల్ మార్కెట్లలోకి వెల్లువలా వస్తున్న నల్లధనం నిరోధానికి ఖచ్ఛితమైన పి-నోట్ నిబంధనలనూ సెబీ రూపొందించింది. అంతేగాక చిన్నతరహా సంస్థలు ఐపిఒల ద్వారా స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించి వాటిని పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసే పనిలోనూ సెబీ నిమగ్నమైంది. కాగా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపిఒ)లో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యుఐబి) కోటా కోసం ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి)లను అర్హులను చేసింది. షెడ్యూల్డ్ బ్యాంకులకు ప్రిఫరెన్షియల్ ఇష్యూ సడలింపులను పొడిగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) ఐపిఒకు సమయం పడుతుందని, దాని కొత్త సిఇఒ నియామకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సెబీ తెలిపింది. అలాగే ఫామ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో కోర్ సెటిల్మెంట్ గ్యారెంటీ ఫండ్‌కు విరాళం ఇవ్వడానికి క్లియరింగ్ సభ్యులకు అనుమతినిచ్చింది. మరోవైపు ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసును సెబీతో జెపిఎమ్ ఆటోమొబైల్స్ పరిష్కరించుకుంది.

సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ