బిజినెస్

సుందర్ పిచాయ్ పారితోషికం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ౄ భారత సంతతి సారథి పనితీరును మెచ్చిన గూగుల్
ౄ 2016లో దాదాపు 200 మిలియన్ డాలర్లకు చేరిక
ౄ 2015లో తీసుకున్నది 99.8 మిలియన్ డాలర్లే

హోస్టన్, ఏప్రిల్ 29: గూగుల్ సిఇఒ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ వేతనం భారీగా పెరిగింది. 2015తో పోల్చితే 2016లో ఏకంగా రెట్టింపయ్యింది. దాదాపు 200 మిలియన్ డాలర్లకు చేరింది. డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూపాయి విలువ ప్రకారం ఈ మొత్తం సుమారు 1,300 కోట్ల రూపాయలకు సమానం. నిజానికి నిరుడు వేతనం రూపంలో పిచాయ్‌కి అందినది అంతకుముందు ఏడాదితో చూస్తే కాస్త తగ్గింది.
2016లో 6 లక్షల 50,000 డాలర్లు అందుకోగా, 2015లో ఇది 6 లక్షల 52,500 డాలర్లు తీసుకున్నారు. అయితే స్టాక్స్ రూపంలో అందినది పెద్ద ఎత్తున పెరిగింది. దీంతో 2015 మొత్తంగా పిచాయ్ పారితోషికం విలువ 99.8 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2016 మొత్తంగా 198.7 మిలియన్ డాలర్లుగా ఉంది. పిచాయ్ సారథ్యంలో గూగుల్ ఆదాయం గణనీయంగా పెరగడంతోనే సంస్థ వేతన కమిటీ.. ఆయనకు భారీగా ముట్టజెప్పిందని సిఎన్‌ఎన్ తెలియజేసింది. గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరు, దాని మాజీ సిఇఒ అయిన లర్రి పేజ్.. అల్ఫాబెట్ అనే ఉమ్మడి సంస్థను ఏర్పాటుచేసి గూగుల్‌సహా ఇతరత్రా అన్ని విభాగాలను దానిలో భాగం చేసినది తెలిసిందే. ఈ క్రమంలో అల్ఫాబెట్ నాయకత్వాన్ని తీసుకున్న లర్రి పేజ్.. 2015 ఆగస్టు 10న గూగుల్ పగ్గాలను పిచాయ్‌కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 2న ఆ బాధ్యతలను స్వీకరించిన దగ్గర్నుంచి గూగుల్ రెవిన్యూ వృద్ధిపథంలోకి అడుగిడింది. ముఖ్యంగా కోర్ అడ్వర్టైజింగ్, యూట్యూబ్ వ్యాపారాల నుంచి ఆదాయం పుంజుకుంది. మెషీన్ లెర్నింగ్, హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్‌లలో పెట్టుబడులనూ పెట్టింది. ఫలితంగా సహజంగానే పనితీరు ఆధారంగా పట్టం కట్టే గూగుల్ యాజమాన్యానికి పిచాయ్ నాయకత్వాన్ని చూసి ముచ్చటేసింది. దీంతో ఒక్కసారిగా పిచాయ్ పారితోషికం రెట్టింపయ్యింది. 44 ఏళ్ల పిచాయ్.. తమిళనాడులోని మధురైలో జన్మించారు. 2004లో గూగుల్‌లో చేరారు. గూగుల్ క్రోమ్, క్రోమ్ ఒఎస్, గూగుల్ డ్రైవ్‌ల సృష్టిలో పిచాయ్‌దే కీలకపాత్ర.
గూగుల్ మ్యాప్స్, జిమెయిల్ వంటి అప్లికేషన్ల రూపకల్పనలోనూ ప్రధానంగా నిలిచారు. 2016లో సరికొత్త స్మార్ట్ఫోన్లనూ గూగుల్ ఆవిష్కరించగా, హార్డ్‌వేర్, క్లౌడ్ సేవలు తదితర మార్గాల ద్వారా జనవరి-మార్చి త్రైమాసికంలో గూగుల్ ఆదాయం దాదాపు 3.1 బిలియన్ డాలర్లను తాకింది. అంతకుముందుతో పోల్చితే ఇది 50 శాతం అధికం కావడం గమనార్హం. ఇక ఈ ఏడాదిలో ఇప్పటిదాకా సెర్చింజన్ గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ షేర్ల విలువ అంతకంతకూ పెరుగుతూనే వస్తుండగా, ఈ వారం సంస్థ మార్కెట్ విలువ తొలిసారిగా 600 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇదిలావుంటే ప్రపంచంలోనే సుందర్ పిచాయ్ అత్యంత అధిక పారితోషికం తీసుకుంటున్న సిఇఒగా అవతరించే వీలుందన్న సంకేతాలు అంతర్జాతీయంగా వస్తున్నాయ. పిచాయ్ సిఇఒ అయన దగ్గర్నుంచి చూస్తే.. స్టాక్ మార్కెట్లలో లిస్టయన ఏ సంస్థ కూడా గడచిన రెండేళ్లలో తమ సిఇఒ వేతనాన్ని ఒక్కసారిగా రెండింతలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మొత్తానికి సుందర్ పిచాయ్ రికార్డు నెలకొల్పారు.

తెలంగాణలో..

వాల్‌మార్ట్ 10 ఔట్‌లెట్లు

హైదరాబాద్, ఏప్రిల్ 29: బహుళజాతి రిటైల్ మార్కెట్ దిగ్గజం, వాల్‌మార్ట్ ఇండియా.. తెలంగాణలో 10 హోల్‌సేల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది.
రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో దాదాపు 120 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తెలంగాణ వ్యాప్తంగా ఈ స్టోర్లను నెలకొల్పాలని చూస్తున్న వాల్‌మార్ట్.. దీనికి సంబంధించి శనివారం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో ఓ ఒప్పందాన్ని కూడా చేసుకుంది. ఎమ్‌ఒయు అనంతరం వాల్‌మార్ట్ ఇండియా అధ్యక్షుడు, సిఇఒ క్రిష్ అయ్యర్ విలేఖరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2024కల్లా 50కిపైగా ఔట్‌లెట్లను తీసుకురావాలనుకుంటున్నామని, అందులోనే తెలంగాణలో పదింటిని ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం భారత్‌లో 21 స్టోర్లను వాల్‌మార్ట్ కలిగి ఉందన్నారు. వీటిలో 95 శాతానికిపైగా ఉత్పత్తులను స్థానికంగానే సేకరిస్తున్నామని చెప్పారు. కాగా, త్వరలోనే ఓ రిటైల్ విధానాన్ని తీసుకువస్తామని తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

విలేఖరులతో మాట్లాడుతున్న వాల్‌మార్ట్ ప్రతినిధి, కెటిఆర్

హైదరాబాద్‌లో..

బిఎస్‌ఇ డిజాస్టర్ రికవరీ సెంటర్

హైదరాబాద్, ఏప్రిల్ 29: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ).. శనివారం హైదరాబాద్‌లో తమ డిజాస్టర్ రికవరీ సెంటర్ (డిఆర్‌సి)ను ప్రారంభించింది. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచీన స్టాక్ ఎక్స్‌చేంజ్ అయిన బిఎస్‌ఇ ఓ ప్రకటన ద్వారా తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ డిఆర్‌సిని ప్రారంభించారు.
కాగా, బిఎస్‌ఇ డిఆర్‌సి అనేది ప్రైమరీ సైట్‌కు నమూనా. వెనువెంటనే డిజాస్టర్ రికవరీ సైట్ వద్ద మొత్తం సమాచారం లభిస్తుంది. ఇతర గ్లోబల్ టెక్నాలజీ హబ్స్ మాదిరిగానే బిఎస్‌ఇ డిఆర్‌సిని రూపొందించారు. దీనివల్ల మరిన్ని ప్రీమియర్ ఇనిస్టిట్యూట్‌లు హైదరా బాద్‌లో పెట్టుబడులు పెట్టేం దుకు అవకాశం లభిస్తుందని బిఎస్‌ఇ లిమిటెడ్ చైర్మన్ సుధాకర్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి డిఆర్‌సికి అందిన సహకారా నికి కృతజ్ఞతలు చెప్పారు.

డిఆర్‌సిని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభిస్తున్న కెటిఆర్

మైక్రోసాఫ్ట్ టెక్నాలజీపై నవ్యాంధ్ర దృష్టి

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
అమరావతి, ఏప్రిల్ 29: ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆధునిక టెక్నాలజీతో ప్రజలకు మరింత వేగంగా చేరువచేసే లక్ష్యంతో ప్రముఖ ఐటి దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో నవ్యాంధ్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు వంద శాతం ప్రజలకు అందేలా టెక్నాలజీ ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. కైజాలా యాప్ ఆధారంగా మైక్రోసాఫ్ట్ తయారుచేసిన అత్యాధునిక టెక్నాలజీ గురించి సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా లోకేష్‌కు వివరించారు. దాన్ని మరింత ఆధునీకరించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి సహకరిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధుల బృందం తెలిపింది. అవినీతి రహిత పాలన అందించటం, ప్రజలు నేరుగా తమకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. వీలైనంత త్వరగా మైక్రోసాఫ్ట్ రియల్ టైం టెక్నాలజీని ప్రభుత్వ శాఖలకు అనుసంధానం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు-టెక్నాలజీతో అనుసంధానం అనే అంశంపై కూడా వీరి మధ్య చర్చ జరిగింది. పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలను గుర్తించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించవచ్చని సంస్థ ప్రతినిధులు లోకేష్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిపై మంత్రి లోకేష్ ఆసక్తి కనబరిచారు. ఈ టెక్నాలజీ ద్వారా గ్రామస్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారిని గుర్తించడం, వారికి సముచిత గౌరవం కల్పించడం సులభమవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. త్వరలోనే ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పార్టీకి అనుసంధానం చేస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేష్ వివరించారు.

సెప్టెంబర్ నాటికి
మరో 33 విమానాశ్రయాలు

కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 29: దేశంలో కొత్తగా మరో 33 విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దేశంలో ప్రస్తుతం 72 విమానాశ్రయాలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మరో 33 విమానాశ్రయాలకు ఎయిర్ కనెక్టివిటీ కల్పించాలని నిర్ణయించామన్నారు. బిజెపి ఎన్నికల హామీలో భాగంగానే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఇక దేశంలో విమానయాన రంగంలో సాధించిన వృద్ధి 22 శాతం అవగా, నవ్యాంధ్ర రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. గ్రామీణ పేదల ఆదాయం పెరగాలనే ఉద్దేశ్యంతోనే విమానయాన రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపుదల జరుగుతుందా? అని విలేఖరులు అడగ్గా ఎన్నికల ముందర ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపు ఖాయమన్నారు. ఆ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఉడాన్ పథకం గురించి ఆడగ్గా షిమ్లా, కడప, నాందేడ్‌లకు ఈ పథకం వర్తింపజేశామన్నారు. ఈ పథకం మూడేళ్లు అమల్లో ఉంటుందని, ఒక రూట్ అభివృద్ధి చెందడానికి రెండేళ్లు పడుతుందని, కాబట్టి అత్యధిక మార్గాలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అయతే ఇందులో నిధుల సమతౌల్యం కోసం కేంద్రం 80 శాతం, రాష్ట్రం 20 శాతం నిధులు భరించాల్సి ఉంటుందని వివరించారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న
ప్రతిపక్షం: గంటా
రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసిన ప్రతిపక్షం అడ్డుకుంటుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం, పట్టిసీమ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా.. అన్నింటినీ అడ్డుకుంటోందని ఆరోపించారు. కాగా, తాను చిటికేస్తే పది నిమిషాల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి వైఖరిని చూసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారన్నారు.