బిజినెస్

స్వల్పంగా పెరిగిన బజాజ్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: దేశీయ ఆటో రంగ సంస్థ, ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీదారైన బజాజ్ ఆటో అమ్మకాలు గత నెల ఏప్రిల్‌లో స్వల్పంగా 1 శాతం పెరిగాయి. ఈ ఏప్రిల్‌లో 3,29,800 యూనిట్లుగా, క్రిందటిసారి ఏప్రిల్‌లో 3,30,109 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో మోటార్‌సైకిల్ విక్రయాలు 2,93,932 యూనిట్లుగా ఉంటే, పోయినసారి 2,91,898 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే వాణిజ్య వాహన అమ్మకాలు ఈసారి 35,868 యూనిట్లుగా, నిరుడు 38,211 యూనిట్లుగా ఉన్నాయి. మరోవైపు ఎగుమతులు మాత్రం 46 శాతం పెరిగి ఈసారి 1,51,913 యూనిట్లుగా ఉండగా, పోయినసారి 1,03,976 యూనిట్లుగా నమోదయ్యాయని బుధవారం సంస్థ తెలియజేసింది.

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రారంభం

స్టార్టప్, ఇంక్యుబేటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహం
తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ సెల్ కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని లోగడ మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నుంచి ఇన్నోవేషన్ సెల్‌లో ఫార్మా, వ్యవసాయం, ఇతర రంగాలకు లబ్ది చేకూరేలా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వీటిలో ముఖ్యంగా టిహబ్, రిచ్ వంటి అంతర్జాతీయ సంస్థలూ ఉన్నాయి. కాగా, రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటుతో పరిశోధనలో మరో ముందడుగు వేసినట్లయ్యింది. రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఐఐఐటి ప్రాంగణంలో ఉంది. ప్రొఫెసర్ రమేష్ లోగనాథన్ (ప్రొఫెసర్ కో-ఇన్నోవేషన్, ఐఐఐటి హైదరాబాద్) ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు మంత్రి కెటిఆర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా స్టార్టప్‌లు ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (ఎస్‌ఐసి) బాగా ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ విధానంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశామన్నారు.
స్టార్టప్స్, ఇంక్యుబెటర్లకు సింగల్ విండో పద్థతిలో పరిపాలన, అన్ని రకాల పాలసీలు ఎస్‌ఐసిలో ఉన్నట్లు ఆయన వివరించారు. నెలకు ఒకసారి నిర్వహించే వర్క్‌షాప్‌ల్లో సమీక్షించుకోవచ్చన్నారు. స్టార్టప్, ఇంక్యుబెటర్ల ఏర్పాటుకు పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన చెప్పారు.