బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదానీ పోర్ట్స్
న్యూఢిల్లీ, మే 24: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఎపిసెజ్) ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,179 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 928 కోట్ల రూపాయలుగా ఉంది అని సంస్థ ప్రకటించింది. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏకీకృత నికర లాభం ఈ జనవరి-మార్చిలో 221 కోట్ల రూపాయలుగా, పోయనసారి 138 కోట్ల రూపాయలుగా నమోదైంది.
లుపిన్
ఔషధరంగ సంస్థ లుపిన్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 380.21 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 747.88 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం ఈసారి 4,253.30 కోట్ల రూపాయలుగా, పోయనసారి 4,197.42 కోట్ల రూపాయలు గా ఉందని సంస్థ తెలియజేసింది.
జివికె పవర్
జివికె పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 205.85 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 105.59 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 25.85 కోట్ల రూపాయలుగా, నిరుడు 17.25 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది.
అమర రాజ బ్యాటరీస్
అమర రాజ బ్యాటరీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 99 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చితే ఇది 9.17 శాతం తక్కువ. నిరుడు 109 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అమ్మకాలు ఈసారి 1,512 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,286 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది.

400లకుపైగా బినామీ లావాదేవీలు
న్యూఢిల్లీ, మే 24: దాదాపు 240 కేసుల్లో 400లకుపైగా బినామీ లావాదేవీలు గుర్తించామని, 600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేశామని ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెలిపింది. దేశవ్యాప్తంగా 24 అంకితభావం కలిగిన బినామీ నిరోధక యూనిట్లను ఆదాయ పన్ను శాఖ గత వారం ఏర్పాటు చేసింది. నిరుడు నవంబర్ నుంచి కొత్త బినామీ లావాదేవీల (నిరోధక) సవరణ చట్టం 2016 క్రింద చర్యలు తీసుకుంటోంది ఆదాయ పన్ను శాఖ. ఈ క్రమంలోనే ఈ నెల 23 వరకు 400లకుపైగా బినామీ లావాదేవీలను గుర్తించింది ఆదాయ పన్ను శాఖ డైరెక్టరేట్స్, ఇనె్వస్టిగేషన్ విభాగం.