బిజినెస్

డిసెంబర్ నాటికి భారత్ జిడిపి వృద్ధి 7.9 శాతం .. మోర్గాన్ స్టాన్లీ అంచనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: సానుకూలమైన విదేశీ డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రికవరీ కారణంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక వృద్ధి దశ (ప్రొడక్టివ్ గ్రోత్ ఫేజ్)లోకి అడుగుపెడుతోందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి జిడిపి వృద్ధి 7.9 శాతానికి పెరిగే అవకాశముందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది.
జిడిపి వృద్ధి మెరుగులకు, నిలకడయిన వృద్ధి వలయానికి సంకేతంగా ప్రోడక్టివ్ గ్రోత్ ఫేజ్ అనే సాంకేతిక పదాన్ని ఉపయోగిస్తారు. జిడిపి వృద్ధి మరింత వేగం పుంజుకోవచ్చని రాబోయే మూడు దశల్లో ఇది దాదాపు 1 శాతం దాకా ఉండవచ్చని ఆ పరిశోధనా పత్రం అంచనా వేసింది. ఈ వృద్ధి వేగం ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే మొదలై ఏడాది చివరి నాటికి దాదాపు ఒక శాతం దాకా ఉండవచ్చని కూడా ఆ పత్రంలో పేర్కొన్నారు. జిఎస్‌టి అమలు వృద్ధి వేగానికి ఒక అడ్డంకి కాబోదని కూడా ఆ పత్రంలో అభిప్రాయపడ్డారు. నిజానికి జిఎస్‌టిని ప్రవేశపెట్టడం వల్ల జిడిపి వృద్ధిలో పెరుగుదల దాదాపు అరశాతం దాకా ఉండవచ్చని ఆ పరిశోధనా పత్రంలో మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది.
7.1 శాతం: ఇక్రా
ముంబయి : దేశంలో పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో గత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7 శాతంగా నమోదైన స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో స్వల్పంగా పెరిగి 7.1 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు దేశీయ రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ తెలిపింది.
అయితే 2015-16 చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 8.4 శాతంగా నమోదైన జిడిపి వృద్ధిరేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువని ‘ఇక్రా’ పేర్కొంది.