బిజినెస్

రూ. 25 వేల కోట్లకు చేరిన డిఎల్‌ఎఫ్ రుణ భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ నికర రుణ భారం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దాదాపు 700 కోట్ల రూపాయలు పెరిగింది. హౌసింగ్ డిమాండ్ ఇంకా మందగమనంలోనే ఉండటంతో సంస్థ రుణ భారం 25,096 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2016 డిసెంబర్ చివరి నాటికి ఇది 24,397 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, శుక్రవారం వెల్లడించిన ఆర్థిక ఫలితాల ప్రకారం ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం 135.63 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు జనవరి-మార్చి వ్యవధిలో 180.54 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరోవైపు డిఎల్‌ఎఫ్ ప్రమోటర్లు.. సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జిఐసితో రాబోయే కొద్దివారాల్లో ఓ ఒప్పందం చేసుకునే అవకాశాలున్నాయి. రెంటల్ వ్యాపారంలో తమ 40 శాతం వాటా అమ్మకానికిగాను ఈ ఒప్పందం కుదిరే వీలుండగా, ఈ వాటా విలువ 13,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.