బిజినెస్

దక్షిణ కొరియాకు శంషాబాద్ నుంచి మామిడి ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: జిఎమ్‌ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) నుంచి దక్షిణ కొరియాకు మామిడి ఎగుమతులు మొదలయ్యాయి. ఈ మేరకు జిఎమ్‌ఆర్ ఓ ప్రకటన ద్వారా శనివారం తెలియజేసింది. హైదరాబాద్ మెంజీస్ ఎయిర్ కార్గో ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌ఎమ్‌ఎసిపిఎల్) నిర్వహిస్తున్న తమ కార్గో టెర్మినల్ నుంచి దక్షిణ కొరియాకు తొలి వాణిజ్య రవాణా ఒప్పందంలో భాగంగా 2.5 టన్నుల భారతీయ మామిడిని ఎగుమతి చేస్తున్నట్లు తెలిపింది. సువర్ణరేఖ రకం మామిడి పండ్ల ఎగుమతికిగాను ఇటు జిహెచ్‌ఐఎఎల్, అటు హెచ్‌ఎమ్‌ఎసిపిఎల్ బృందాలు తమ విజయనగరంలోని ప్లాంట్ వద్ద మామిడి రైతులతో కలిసి శ్రమిస్తున్నారని, పండ్ల ప్యాకేజింగ్ తదతర ఏర్పాటు చేస్తున్నారని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఉత్తర కర్నాటక, తూర్పు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ మరిన్ని ప్లాంట్లను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు జిఎమ్‌ఆర్ తెలిపింది.

చిత్రం... శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ
విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్