బిజినెస్

నర్సరీ రైతులకు జిఎస్‌టి మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, మే 28: దేశవ్యాప్తంగా నర్సరీల్లో మొక్కల అమ్మకాలు, కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. నర్సరీలను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చే సెక్షన్ 7, 8ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. అఖిల భారత నర్సరీ రైతు సంఘం అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని వెల్లడించారు.
కడియంలో ఎపి నర్సరీమెన్ అసోసియేషన్ సమావేశం ఆదివారం నిర్వహించారు. హార్టికల్చరల్ కమిషనర్ చిరంజీవి చౌదరి, ఎపి యుజిబిసి ఎండి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో నర్సరీ రైతుల సమస్యలపై చర్చ జరిగింది. నర్సరీ వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారిన జిఎస్‌టి.. రద్దుకు సహకరించిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీకి అఖిల భారత నర్సరీ రైతు సంఘం కృతజ్ఞతలు తెలిపింది. నర్సరీ మొక్కల అమ్మకాలు ఇ కామర్స్ ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని, నర్సరీ రైతులు సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకోవాలని చిరంజీవి చౌదరి సూచించారు. మొక్కలను భూమిపై కాకుండా బల్లలపై పెంచే విధానం పట్ల కడియం నర్సరీ రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ మేరకు సబ్సిడీపై ఆ సదుపాయాలను ఏర్పాటుచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సరీ మొక్కల ఉత్పత్తికి అవసరమైన షేడ్ నెట్లు, పాలీహౌస్‌లు, ట్రాలీ, ఇరిగేషన్ సిస్టం ఏర్పాటుపై ఉద్యానవన శాఖ పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోందని, దీన్ని నర్సరీ రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ దిలీప్, ఆర్కిటెక్ట్ నవీన్, కడియం నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పి చంటి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న చిరంజీవి చౌదరి