బిజినెస్

పి-నోట్లపై సెబీ లెవీ ఫీజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: పార్టిసిపేటరీ (పి)-నోట్ల జారీపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. సోమవారం లెవీ ఫీజును ప్రతిపాదించింది. విదేశీ మదుపరుల ద్వారా జారీ అయ్యే ప్రతీ పి-నోట్‌పై 1,000 డాలర్లను రెగ్యులేటరీ లెవీ ఫీజుగా వేస్తామని తెలిపింది. ఇవి నల్లధనానికి ఏవిధంగానూ ఊతమివ్వకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సెబీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా, పార్టిసిపేటరీ నోట్లు లేదా ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రూమెంట్స్ (ఒడిఐ)ల ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడుల విలువ ఇప్పటికే నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో సెబీ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఫోర్డ్ వాహనాలపై
రూ. 30 వేల వరకు డిస్కౌంట్
న్యూఢిల్లీ, మే 29: ప్రముఖ విదేశీ ఆటో రంగ సంస్థ ఫోర్డ్.. తమ వాహనాలపై 30 వేల రూపాయల వరకు రాయితీని ప్రకటించింది. ఎస్‌యువి ఎకోస్పోర్ట్, సెడాన్ అస్పైర్, హచ్‌బ్యాక్ ఫిగో కార్ల ధరలపై ఈ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఎకోస్పోర్ట్ ధరను 20 నుంచి 30 వేల రూపాయల వరకు, ఫిగో, అస్పైర్ ధరలను 10 నుంచి 25 వేల రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. జూలై 1 నుంచి అమలయ్యే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)తో కలిగే ప్రయోజనాలను తమ కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ ధరల తగ్గింపు అని ఫోర్డ్ సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది.