బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ... మ్యాక్స్ ఫైనాన్షియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: మ్యాక్స్ ఫైనాన్షియల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 593.27 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 393.19 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 15,227.89 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం తెలిపింది. నిరుడు 11,696.14 కోట్ల రూపాయలుగా ఉంది.
హిందాల్కో ఇండస్ట్రీస్
హిందాల్కో ఇండస్ట్రీస్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 502.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 401 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం ఆదాయం ఈసారి 11,969.6 కోట్ల రూపాయలుగా, నిరుడు 9,472 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం పేర్కొంది.
హడ్కో
ప్రభుత్వరంగ సంస్థ హడ్కో నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 315.36 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 398.21 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం ఆదాయం ఈసారి 906.85 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం తెలిపింది. నిరుడు 992.52 కోట్ల రూపాయలని చెప్పింది.
రామ్‌కో సిమెంట్స్
రామ్‌కో సిమెంట్స్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 134.47 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 182.44 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మొత్తం ఆదాయం ఈసారి 1,195.77 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,156.46 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం వెల్లడించింది.
ఎమ్‌ఒఐఎల్
ప్రభుత్వరంగ సంస్థ ఎమ్‌ఒఐఎల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ఐదింతలు పెరిగి 115.80 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 21.38 కోట్ల రూపాయల లాభం పొందింది. మొత్తం ఆదాయం ఈసారి 252.72 కోట్ల రూపాయలుగా, నిరుడు 211.02 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం సంస్థ తెలియజేసింది.
అపోలో హాస్పిటల్స్
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 40.76 శాతం పడిపోయ 48.16 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 81.31 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మొత్తం స్టాండలోన్ ఆదాయం ఈసారి 1,670.77 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,457.34 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం చెప్పింది.