బిజినెస్

జూన్ 15లోగా డీలర్లంతా నమోదు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: తెలంగాణలో పనిచేస్తున్న వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన డీలర్లంతా తమ వివరాలను గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి) నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషనర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జిఎస్‌టి నెట్‌వర్క్ ప్రత్యేక పోర్టల్‌ను జూన్ 1 నుండి 15 వరకు తెరిచి ఉంచుతామని వివరించారు. ఇప్పటి వరకు డీలర్లు తమ పేర్లను, వివరాలను నమోదు చేసుకోకపోతే జూన్ మొదటి పక్షం రోజుల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చామన్నారు. జూలై 1 నుండి జిఎస్‌టి అమల్లోకి వస్తుండటంతో అనివార్యంగా వ్యాపారులంతా తమ పేర్లను జిఎస్‌టి నెట్‌వర్క్‌లో నమోదు చేసుకోక తప్పదని కమిషనర్ వివరించారు. డీలర్లు పూర్తి వివరాలతో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లో కూడా డీలర్లు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించామని కమిషనర్ స్పష్టం చేశారు.