బిజినెస్

అందరికీ విమానయానం.. అదే మా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: దేశీయ విమానయాన రంగం దూసుకుపోతోందని పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతి రాజు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని మంగళవారం ఇక్కడ తెలిపారు. విమానయాన వృద్ధిరేటులో అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో, దేశీయంగా మూడో స్థానంలో భారత్ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో పౌర విమానయాన శాఖ సాధించిన ప్రగతి వివరాలను ఆ శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు, సహాయ మంత్రి జయంత్ సిన్హా మీడియాకు వివరించారు.
కాగా, విమాన టిక్కెట్ల ధరలు బాగా తగ్గయని, నిరుడు సగటు విమాన చార్జీల్లో 18 శాతం క్షీణత చోటుచేసుకుందని చెప్పారు. అందరికీ విమానయాన సేవలు అందుబాటు లోకి రావాలన్న లక్ష్యంతో టిక్కెట్ చార్జీలు దిగివచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా విమానయాన వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచామని, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విమాన రాకపోకలను పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు విమాన సరకు రవాణా (కార్గొ)లో 10 శాతం వృద్ధి సాంధించినట్టు అశోక్ గజపతిరాజు వెల్లడించారు. విమానయాన సంస్థల మధ్య పోటీతత్వం పెరిగి సామాన్యుడికి విమాన టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సామాన్యుడికి విమానయానం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే యుడిఎఎన్(ఉడాన్) పథకాన్ని తీసుకొచ్చినట్టు మంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు ఉన్నా.. ఇంకా అందుబాటులోలేని ప్రాంతాలపై తమ మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందని ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఒక్కొక్క దానికి 50 నుంచి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. కాగా, ఉడాన్ పథకంలో భాగంగా కొత్తగా 50 విమానాలు కొనుగోలు చేయనున్నట్టు అశోక్ గజపతిరాజు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం కూడా తీసుకుందని ఆయన వెల్లడించారు.
ఉడాన్ పథకంలో గంటపాటు విమానయాన ప్రయా ణ చార్జీని 2,500 రూపాయలకే కుదించినది చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానయాన అనుకూల రాష్ట్రంగా ఉందని ఆయన అన్నారు. గన్నవరం, రాజమండ్రి, కడప రన్‌వేల విస్తరణకు భూసేకరణ త్వరితగతిన జరగడం వల్ల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. దేశీయ విమానయాన రంగంలో జాతీయ సగటు కంటే రెట్టింపు వృద్ధిరేటును ఏపి సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పన్నురేట్లను 20 శాతం నుంచి 25 శాతానికి పెంచితే, ఏపి 16 శాతం నుంచి 1 శాతానికి తగ్గించిందని గుర్తుచేశారు.
విజయవాడ గన్నవరంలో రన్‌వే విస్తరణ ఏడాదిలోపు పూర్తయ్యే అవకాశం ఉందని, అది పూర్తయితే పెద్ద విమానాలు దిగేందుకు అవకాశం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి అన్నారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం.. సర్వే నిర్వహణ బాధ్యతను రైట్స్ సంస్థకు అప్పగించిందని చెప్పారు. సర్వే నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా, ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుత నిర్వహణ సామర్థ్యం పెరిగిందని, దీనిపై అభివృద్ధికి నీతి ఆయోగ్ కూడా అధ్యయనం చేస్తుందని చెప్పారు.

చిత్రం... ఢిల్లీలో మంగళవారం గత మూడేళ్లలో పౌర విమానయాన రంగం వృద్ధిపై పుస్తకాన్ని విడుదల చేస్తున్న
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. సహాయ మంత్రి జయంత్ సిన్హా