బిజినెస్

వరుస రికార్డులకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో కొనసాగుతున్న సూచీ లు.. రోజుకో రికార్డును అందుకుంటూ వచ్చినది తెలిసిందే. అయితే బుధవారం మాత్రం ఈ జోరుకు బ్రేక్ పడింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 13.60 పాయింట్లు కోల్పోయి 31,145.80 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 3.30 పాయింట్లు పడిపోయి 9,621.25 వద్ద నిలిచింది. మెటల్, ఐటి, టెక్నాలజీ రంగాలు 1.43 శాతం నుంచి 0.65 శాతం మేర పతనమవగా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, బ్యాంకింగ్, పవర్ రంగాల షేర్లు 0.97 శాతం నుంచి 0.53 శాతం మేర పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీల్లో చైనా సూచీ లాభపడగా, హాంకాంగ్, జపాన్ సూచీ నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీల్లో జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభపడగా, ఫ్రాన్స్ సూచీ మాత్రం నష్టపోయింది.