బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు.. ఎమ్‌ఆర్‌పిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్
న్యూఢిల్లీ, మే 31: ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ ఏకీకృత నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 528.29 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 105.37 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకుంది. మొత్తం ఆదాయం ఈసారి 1,982.68 కోట్ల రూపాయలుగా, నిరుడు 2,066.01 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ పేర్కొంది.
భూషణ్ స్టీల్
రుణ పీడిత సంస్థ భూషణ్ స్టీల్‌కు గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 756.76 కోట్ల రూపాయల నికర నష్టం వాటిల్లింది. అయతే అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో నష్టం 657.56 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి నష్టాలు తగ్గినట్లైంది. కాగా, ఆదాయం ఈసారి 4,558.93 కోట్ల రూపాయలుగా ఉండగా, నిరుడు 3,457.32 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఎమ్‌టిఎన్‌ఎల్
ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ ఎమ్‌టిఎన్‌ఎల్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 634.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 188.64 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. మొత్తం ఆదాయం ఈసారి 963.12 కోట్ల రూపాయలుగా, నిరుడు 992.65 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ పేర్కొంది.
యునిటెక్ లిమిటెడ్
నిర్మాణ రంగ సంస్థ యునిటెక్ లిమిటెడ్ ఏకీకృత నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 291.25 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 483.54 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. మొత్తం ఆదాయం ఈసారి 467.53 కోట్ల రూపాయలుగా, నిరుడు 438.93 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ పేర్కొంది.
జెపివిఎల్
జైప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జెపివిఎల్) స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 229.82 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 335.57 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం స్టాండలోన్ ఆదాయం ఈసారి 678.79 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపింది. నిరుడు 676.17 కోట్ల రూపాయలని చెప్పింది.
బిఎస్ లిమిటెడ్
బిఎస్ లిమిటెడ్ స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 202.51 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 15.63 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మొత్తం ఆదాయం ఈసారి 34.07 కోట్ల రూపాయలుగా, నిరుడు 638.47 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ వెల్లడించింది.
యునైటెడ్ స్పిరిట్స్
లిక్కర్ దిగ్గజం యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 104.2 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 1.4 కోట్ల రూపాయల లాభం పొందింది. నికర అమ్మకాలు ఈసారి 6,474.2 కోట్ల రూపాయలుగా, నిరుడు 5,930.9 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియ