బిజినెస్

అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లాస్టిక్ ప్రాసెసింగ్ క్లస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లాస్టిక్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ పారిశ్రామిక, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఈ క్లస్టర్‌లో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల వౌలిక సదుపాయాలను కల్పిస్తామని బాలమల్లు బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులతో ఇటీవల సమావేశమై చర్చించినట్లు కూడా ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎంఎస్‌ఎం పథకాల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టిఎస్‌ఐఐసి పరిశ్రమల క్లస్టర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఢిల్లీ తెలంగాణ భవన్‌కు
కొత్త వాహనాలు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మే 31: దేశ రాజధానిలో పరిపాలనా సౌలభ్యం కొరకు తెలంగాణ ప్రభుత్వం 1.2 కోట్ల రూపాయల వ్యయంతో 12 కొత్త వాహనాలను కొనుగోలు చేసింది. ఈ వాహనాలను బుధవారం తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రుడు తెజావత్ ప్రారంభించారు. ఈ మేరకు వేణుగోపాలచారి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవసరాలకు సరిపడా వాహనాలు లేనందున, ఢిల్లీ పర్యటనలో మంత్రులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం నూతన వాహనాలు కొనుగోలు చేసిందని వెల్లడించారు. అలాగే విభజన అనంతరం తెలంగాణకు కేటాయించిన భవనాల ఆధునికీకరణకు ఐదు కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. మరోవైపు జూన్ 2న ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిచేందుకుగాను ప్రభుత్వం మరో 25 లక్షల రూపాయలనూ విడుదల చేసిందని, వేడుకలలో పాల్గొనాలని కేంద్ర మంత్రులను, వివిధ దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానించామన్నారు.

ఎఐఐబి వార్షిక సమావేశానికి జైట్లీ
న్యూఢిల్లీ, మే 31: దక్షిణ కొరియాలో జరిగే ఆసియా వౌలిక రంగ పెట్టుబడుల బ్యాంక్ (ఎఐఐబి) వార్షిక సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరుకానున్నారు. చైనా నేతృత్వంలో నడుస్తున్న ఈ బ్యాంక్.. ఆసియా దేశాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన వౌలిక రంగ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేస్తోంది. చైనా తర్వాత ఎఐఐబిలో 7.5 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉన్నది భారతే. కాగా, జూన్ 14-15 తేదీల్లో బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సమావేశం జరగనుంది. నిరుడు బీజింగ్‌లో తొలి సమావేశం జరిగింది.

ఆంధ్రా బ్యాంక్ మొబైల్ యాప్ ఆవిష్కరణ
హైదరాబాద్, మే 31: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్.. తమ ఖాతాదారుల కోసం ఓ మొబైల్ యాప్‌ను బుధవారం ప్రారంభించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎబిటిఇజెడ్ (ఫేజ్ 1) అనే ఈ యాప్‌ను టెలీకమ్యూనికేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ వ్యవస్థాపకుడు టి హనుమాన్ చౌదరి ఆవిష్కరించారు. ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌తో కస్టమర్లు తమ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వెనువెంటనే, మరింత భద్రంగా నమోదు, యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు కలిగింది. నిరంతర లావాదేవీలను జరుపుకోవడమేగాక, తమ మొబైల్, డిటిహెచ్ తదితర సేవల బిల్లులనూ చెల్లించవచ్చు.

ఓరియంట్ సిమెంట్ చేతికి జేపీ సంస్థలు
న్యూఢిల్లీ, మే 31: సికె బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్.. రుణ పీడిత జేపీ గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలను సొంతం చేసుకుంటోంది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ కొనుగోలులో సదరు రెండు సంస్థలను 1,946 కోట్ల రూపాయలకు ఓరియంట్ సిమెంట్ దక్కించుకుంటోంది. వచ్చే ఏడాది మార్చికల్లా ఈ లావాదేవీలు పూర్తయ్యే వీలుంది. భిలాయ్ జేపీ సిమెంట్ లిమిటెడ్ నుంచి 74 శాతం వాటాను 1,450 కోట్ల రూపాయలకు ఓరియంట్ సిమెంట్ అందుకుంటోంది. అలాగే నైగ్రీ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌నూ 496 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంటోంది.
ఎయిరిండియా ప్రైవేటీకరణపై
త్వరలో కేబినెట్ భేటీ?
న్యూఢిల్లీ, మే 31: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర కేబినెట్ త్వరలో భేటీ కానుంది. నీతి ఆయోగ్ సూచన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కేబినెట్ చర్చకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిరిండియాకు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని చేసినది తెలిసిందే. అయినప్పటికీ నష్టాలు మాత్రం అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎయిరిండియాకు 30,000 కోట్ల రూపాయల నిధులను అందించే బదులుగా ఆ నిధులను ఆరోగ్య, విద్య రంగాలకు కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని నీతి ఆయోగ్ వ్యక్తం చేసింది. దీంతో ఎయిరిండియా ప్రైవేటీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.