బిజినెస్

గ్రానైట్ పరిశ్రమకు జిఎస్‌టిలో మినహాయింపు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులో తెలుగు రాష్ట్రాలలోని గ్రానైట్ పరిశ్రమకు పాత పన్ను విధానమే కొనసాగించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి లేఖ రాశారు. బుధవారం ఇక్కడ ఏపి, తెలంగాణలకు చెందిన పలువురు గ్రానైట్ పారిశ్రామికవేత్తలు సురవరంతోపాటు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి తమ సమస్యలను వారికి వివరించారు.
ఈ మేరకు సిపిఐ సినియర్ నాయకుడు నారాయణ విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో గ్రానైట్‌కు సంబంధించిన పరిశ్రమల్లో లక్షలాది మంది జీవిస్తున్నారని, జిఎస్‌టి అమల్లోకి వస్తే గ్రానైట్ పరిశ్రమపై 28 శాతం పన్ను భారం పడుతుందని చెప్పారు. గ్రానైట్ పరిశ్రమ విషయంలో పాత పన్ను విధానానే్న కోనసాగించాలని కోరారు.

పెరిగిన
పెట్రో ధరలు
న్యూఢిల్లీ, మే 31: అంతర్జాతీయ ఇంధన రేట్లకు అనుగుణంగా దేశంలో పెట్రోల్ లీటర్‌కు రూ. 1.23, డీజిల్ లీటర్‌కు 89 పైసలు పెరిగింది. ప్రతీ పక్షం రోజులకోసారి అంతర్జాతీయ ముడి చమురు రేట్లలో హెచ్చు తగ్గులకు అనుగుణంగా పెరగటం లేదా తగ్గటం జరుగుతుందన్న విషయం తెలిసిందే. మే 16న పెట్రోల్‌పై రూ. 2.16, డీజిల్‌పై రూ. 2.10 తగ్గించిన పెట్రోల్ కంపెనీలు.. ఇప్పుడు అంతర్జాతీయ ధరలు పెరగటంతో ఈ తాజా వడ్డన జరిపాయి. స్థానిక లెవీలు లేదా వ్యాట్‌తో సంబంధం లేకుండా ఈ ధరలు పెంచటం వల్ల ఆయా రాష్ట్రాల పన్నురేట్లను బట్టి వీటి ధరలు ఉంటాయి.