బిజినెస్

పెట్టుబడులకు విస్తృత అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 31: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. స్పెయిన్ పర్యటన సందర్భంగా అక్కడి సంస్థలను ఆహ్వానించారు. ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా బుధవారం మోదీ స్పెయిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగానే భారత్ సాధిస్తున్న బలమైన వృద్ధిరేటు వివిధ రంగాల్లో స్పెయిన్ సంస్థలకు విస్తృతంగా పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తుందన్నారు.
ఈ పర్యటనలో స్పెయిన్ ప్రధాన మంత్రి మరియానో రజోయ్‌తో చర్చలు జరిపిన మోదీ.. ఏడు ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. కాగా, భారత్‌లో స్పెయిన్‌కు చెందిన 200లకుపైగా సంస్థలున్నాయి. రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు, రైల్వేలు, పవన విద్యుదుత్పత్తి, వాటర్ డెసలినేషన్, రక్షణ, స్మార్ట్ సిటీల ఏర్పాటులో ఈ సంస్థలు కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. అలాగే స్పెయిన్‌లోనూ 40కిపైగా సంస్థలుండగా, టెక్నాలజీ, ఔషధ, ఆటోమోటివ్, ఎనర్జీ రంగాల్లో పనిచేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య 2016లో ద్వైపాక్షిక వాణిజ్యం 5.27 బిలియన్ డాలర్లుగా ఉంది. యూరోపియన్ యూనియన్ (ఈయు)లోగల దేశాల్లో భారత్‌కు స్పెయిన్ ఏడో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. అలాగే భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న విదేశాల్లో స్పెయిన్ 12వ స్థానంలో ఉంది. ఈ క్రమంలో వౌలిక, పర్యాటక, ఎనర్జీ, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు గొప్ప అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని స్పెయిన్ సంస్థలకు మోదీ పిలుపునిచ్చారు. ఇదిలావుంటే 1992 నుంచి స్పెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాన మంత్రి మోదీనే కావడం గమనార్హం. గడచిన పాతికేళ్లలో భారత్ నుంచి స్పెయిన్‌కు వెళ్లిన ప్రధానులెవరూ లేరు. కాగా, ఈ పర్యటన సందర్భంగా ఈయు-్భరత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలకమన్న అభిప్రాయాన్ని అటు భారత్, ఇటు స్పెయిన్ వ్యక్తం చేశాయి. ఈ ఒప్పందం అవసరాన్ని చాటాయి. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, సైబర్ సెక్యూరిటీ, రెన్యువబుల్ ఎనర్జీ, సివిల్ ఏవియేషన్ తదితర రంగాల్లో ఒప్పందాలు ఇరు దేశాల మధ్య కుదిరాయి.

చిత్రం... అస్పెయన్ ప్రధాని మరియానో రజోయ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ