బిజినెస్

చౌక 4జి మొబైల్స్‌ను ఆవిష్కరించిన రిలయన్స్ జియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 8: ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. శుక్రవారం ఇక్కడ ఎల్‌వైఎఫ్ చౌక 4జి మొబైల్ ఫోన్లను ఆవిష్కరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఎల్‌వైఎఫ్ బ్రాండ్ క్రింద తక్కువ ధరతో 4జి మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే వీటిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హోర్డింగుల ద్వారా ఆవిష్కరించింది. ఈ దృశ్యాలను సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘అమరావతి మారథాన్’కు జియో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
ఉత్పత్తి, రవాణాలో ఇదే ఒరవడి సాగాలి
సింగరేణి సిఎండి శ్రీధర్ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 8: బొగ్గు ఉత్పత్తి, రవాణాలో భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని సింగరేణి సిఎండి శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడిక్కడ సింగరేణి భవన్‌లో నాలుగు జిల్లాల్లోని సంస్థ ఉన్నతాధికారులతో సిఎండి వీడియో కానె్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మొదటి 9 నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్)నే రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా 24 శాతం వృద్ధి చెందిందన్నారు. ముఖ్యంగా గోదావరిఖనిలోని అడ్రియాలా లాంగ్‌వాల్ భూగర్భ గని ద్వారా అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి అయ్యిందని తెలిపారు.
దీంతో అడ్రియాలా లాంగ్‌వాల్ ప్రాజెక్టుకు 50 వేల రూపాయల నగదు అవార్డును సిఎండి ప్రకటించారు. ఇదేవిధంగా అత్యధిక బొగ్గు రవాణా చేసిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు కూడా క్యాష్ అవార్డులు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెల వరకు 5.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5.6 మిలియన్ టన్నుల రవాణా జరగాలని ఆయన సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 3 నెలల్లో అంతా కలిసికట్టుగా పనిచేసి సింగరేణి సంస్థను ప్రగతిపథంలో తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
మార్చిలోగా పెట్రోల్, డీజిల్‌పై
మళ్లీ ఎక్సైజ్ పన్ను పెంపు?
న్యూఢిల్లీ, జనవరి 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరోసారి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని చూస్తోంది. జిడిపిలో ద్రవ్యలోటును 3.9 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి మళ్లీ ఎక్సైజ్ పన్ను పెంపు దిశగా కేంద్రం అడుగులేస్తోంది. ఈ మార్చిలోగా పెరిగే అవకాశాలున్నాయి. గత వారమే లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ పన్ను పెరిగినది తెలిసిందే. అయినప్పటికీ ఈ భారాన్ని వినియోగదారులపై ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వేయకపోవడంతో ధరలు పెరగలేదు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు నానాటికీ పడిపోతున్నప్పటికీ ప్రభుత్వ పన్నుల కారణంగానే ఆ స్థాయిలో దేశీయంగా ధరలు దిగిరావడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును మరోసారి పెంచాలని చూస్తుండగా, ఇదే జరిగితే వినియోగదారులపై భారం తప్పదని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి.