బిజినెస్

హైదరాబాద్‌లో ఆస్తులు చాలా చౌక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో తక్కువ ధరకే ఆస్తుల కొనుగోలుకు అవకాశమున్న టాప్-10 ప్రాంతాల్లో హైదరాబాద్ ముందుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. తాజా నివేదికలో 10 చౌక ప్రాపర్టీ మార్కెట్లలో హైదరాబాద్ తర్వాత పుణె, నవీ ముంబయి, అహ్మదాబాద్‌లున్నాయి. తర్వాతి స్థానాల్లో కొచ్చి, ఘజియాబాద్, జైపూర్, నాగ్‌పూర్, సూరత్, కొయంబత్తూర్ టాప్-10లో చొటు దక్కించుకున్నాయి. ఈ నగరాల్లో 30 నుంచి 50 లక్షల రూపాయలకు ఆస్తులు కొనుగోలు చేయవచ్చని జెఎల్‌ఎల్ స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, పుణె నగరాల్లో ఆస్తులు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నట్లు జెఎల్‌ఎల్ సర్వేలో తేలింది. హైదరాబాద్‌లోని మణికొండ, కూకట్‌పల్లి, మియాపూర్, సైనిక్‌పురి ప్రాంతాల్లో ఇండ్లు 30-50 లక్షల రూపాయలకే లభిస్తున్నాయని పేర్కొంది.