బిజినెస్

టిసిఎస్ నికర లాభం రూ. 6,083 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 12: దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 14.2 శాతం పెరిగి 6,083 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 5,328 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 11.7 శాతం పెరిగి 27,364 కోట్ల రూపాయలకు చేరింది. అంతకుముందు 24,501 కోట్ల రూపాయలకు పరిమితమైంది. కాగా, సాధారణంగానే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఐటి సంస్థల వ్యాపారం తక్కువగా ఉంటుందని, ఈసారి చెన్నై వరదల ప్రభావంతో మరింత తగ్గిందని టిసిఎస్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. అంతర్జాతీయంగా ఉత్తర అమెరికా, ఐరోపా మార్కెట్లలో ఆశించిన స్థాయిలోనే సంస్థ కార్యకలాపాలు జరిగాయని చెప్పారు.

4వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న బిపి

లండన్, జనవరి 12: అంతర్జాతీయ చమురు ఉత్పాదక దిగ్గజం బ్రిటిష్ పెట్రోలియం (బిపి).. సుమారు 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీ స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో రాబోయే రెండేళ్లకుపైగా కాలంలో చమురు అనే్వషణ, ఉత్పత్తి తక్కువగా ఉంటుందని భావించే ఉద్యోగుల తొలగింపునకు దిగింది బిపి. గ్లోబల్ మార్కెట్‌లో మంగళవారం బ్యారెల్ చమురు ధర పనె్నండేళ్ల కనిష్టానికి పతనమై 31 డాలర్లకు చేరింది. ఈ క్రమంలోనే తాజా నిర్ణయానికి వచ్చింది బిపి.

ఆయిల్ ఇండియా షేర్‌కు డివిడెండ్ రూ. 8

న్యూఢిల్లీ, జనవరి 12: ప్రభుత్వరంగ చమురు ఉత్పాదక సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్).. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌కు 8 రూపాయలుగా నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి 325 కోట్ల రూపాయలు రానున్నాయి. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి 67.64 శాతం వాటా ఉంది. దేశీయంగా ఆయిల్ ఇండియా ప్రస్తుతం రెండో అతిపెద్ద చమురు అనే్వషణ, ఉత్పత్తి సంస్థ. కాగా, ఈ మధ్యంతర డివిడెండ్ నిర్ణయాన్ని సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ తీసుకుంది.

టాటా మోటార్స్
విదేశీ అమ్మకాల్లో వృద్ధి

న్యూఢిల్లీ, జనవరి 12: టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల డిసెంబర్‌లో 7 శాతం పెరిగి 91,762 యూనిట్లుగా నమోదయ్యాయి. 2014 డిసెంబర్‌లో 85,742 యూనిట్లను అమ్మింది.
ఈ మేరకు ఓ ప్రకటనలో టాటా మోటార్స్ తెలియజేసింది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 55,145 యూనిట్ల నుంచి 59,287 యూనిట్లకు పెరగగా, లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలు 42,962 యూనిట్ల నుంచి 50,972 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహన విక్రయాలు కూడా 30,597 యూనిట్ల నుంచి 32,475 యూనిట్లకు ఎగిశాయి.

ఎబిఎఫ్‌ఆర్‌ఎల్‌గా
మారిన పాంటలూన్స్

న్యూఢిల్లీ, జనవరి 12: పాంటలూన్స్ ఫ్యాషన్ అండ్ రిటైల్ పేరు ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్(ఎబిఎఫ్‌ఆర్‌ఎల్)గా మారింది. పాంటలూన్స్ ఫ్యాషన్ అండ్ రిటైల్‌ను ఆదిత్యా బిర్లా నువో లిమిటెడ్ సొంతం చేసుకున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం దాని పేరును మార్చారు. కొత్త పేరు వెంటనే అమల్లోకి వస్తుందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలిపింది. కాగా, గత ఏడాది మే నెలలో తమ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని దుస్తులు, ఫ్యాషన్ వ్యాపారాలు ఒక్కటిగా చేస్తున్నామని ఆదిత్యా బిర్లా నువో లిమిటెడ్ ప్రకటించినది తెలిసిందే.