బిజినెస్

స్మాల్, మిడ్-క్యాప్ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: కొత్త సంవత్సరంలో మదుపరులు.. చిన్న సంస్థల్లోకంటే పెద్ద సంస్థల్లో పెట్టుబడులకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటిదాకా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) బ్లూచిప్ సూచీ సెనె్సక్స్‌లోని సంస్థల షేర్ల విలువ 6 శాతానికిపైగా పడిపోతే, స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీలు 10 శాతం వరకు దిగజారాయి.
జనవరి 1-25 మధ్య జరిగిన ట్రేడింగ్ సెషన్లలో సెనె్సక్స్ 6.24 శాతం కోల్పోయి 24,485.95 వద్ద స్థిరపడగా, స్మాల్-క్యాప్ 9.62 శాతం పతనమై 10,697.91 వద్ద, మిడ్-క్యాప్ 8.52 శాతం క్షీణించి 10,217.05 వద్ద నిలిచాయి. ఈ నెలలో 20వ తేదీన సెనె్సక్స్ 23,839.76 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకగా, మిడ్-క్యాప్ 9,892.36 పాయింట్ల చారిత్రాత్మక కనిష్టానికి చేరింది. దీంతో మదుపరుల ఆలోచనా ధోరణిలో చోటుచేసుకున్న మార్పులతో స్మాల్, మిడ్-క్యాప్ సూచీలు తీవ్ర అనిశ్చితికి లోనవుతున్నాయని మార్కెట్ నిపుణులు విశే్లషిస్తున్నారు.
నిజానికి గత ఏడాది భారీ సంస్థల్లో పెట్టుబడుల కంటే చిన్న, మధ్యతరహా సంస్థల్లో పెట్టుబడులే పదిలమని మదుపరులు భావించారు. అలాగే పెట్టుబడులనూ పెట్టుకుంటూ వచ్చారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. లాభనష్టాల ప్రభావం పెద్ద సంస్థల్లో భారీగా ఉంటే, చిన్న, మధ్యతరహా సంస్థల్లో తక్కువగా ఉండటమే. సగటు మదుపరుల ఆలోచనకు చిన్న, మధ్యతరహా పెట్టుబడులు దగ్గరగా ఉండటం కూడా స్మాల్, మిడ్-క్యాప్ సూచీల ప్రదర్శన 2015లో ఆకట్టుకుంది. అయితే ఈ నెల మొదలు మదుపరుల తీరు మారింది. భారీ సంస్థల షేర్ల కొనుగోలు వైపునకే మొగ్గు చూపారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీయ మదుపరులు, బడా షేర్లను విదేశీ మదుపరులు కొంటారని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర రికార్డు స్థాయిలో 28 డాలర్ల దిగువకు పడిపోవడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 68 రూపాయల దరిదాపుల్లో కదలాడుతుండటం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది తెలిసిందే. దీంతో సెనె్సక్స్‌తోపాటు స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీలన్నింటిలో మదుపరుల పెట్టుబడులు తగ్గిపోగా, స్మాల్, మిడ్-క్యాప్‌లలో అధికంగా తగ్గాయి. కాగా, బడా సంస్థల మార్కెట్ విలువలో ఐదో వంతున్నవి మధ్యతరహా సంస్థలుగా, పదో వంతున్నది చిన్న సంస్థలుగా పరిగణిస్తారు.