బిజినెస్

నేవీ చేతికి ‘సహాయక్’ ( హెచ్‌ఎస్‌ఎల్‌లో తయారైన మరో టగ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింథియా(విశాఖ), జనవరి 27: విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్) మరో కొత్త టగ్‌ను విజయవంతంగా పూర్తిచేసి నేవీకి అందజేసింది. బుధవారం షిప్‌యార్డు జనరల్ మేనేజర్ కెవి సూర్యారావు జెండా ఊపి టగ్‌ను జలప్రవేశం చేయించారు. భారత నావికాదళం అప్పగించిన మూడు టగ్‌ల్లో గతంలోనే ఒక టగ్‌ను పూర్తిచేసి అందించగా, బుధవారం మరో టగ్ ‘సహాయక్’ను అప్పగించారు. సుమారు 113 కోట్ల రూపాయిలతో నిర్మించిన ఈ టగ్ రక్షణ శాఖలో కీలక పాత్ర పోషించనుంది. సముద్రంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయక్ పూర్తిస్థాయిలో సహాయ పడుతుందని సంస్థ జిఎం స్పష్టం చేశారు. ఇది గంటకు 12 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది.

జెండా ఊపి టగ్‌ను ప్రారంభిస్తున్న షిప్‌యార్డు జిఎం

కెల్టన్ టెక్ చేతికి బొకనీ కన్సల్టింగ్

హైదరాబాద్, జనవరి 27: అమెరికాకు చెందిన సంస్థ, క్లౌడ్ అండ్ అనలిటిక్స్ సర్వీసెస్ ప్రొవైడర్.. బొకనీ కన్సల్టింగ్‌ను కొనుగోలు చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన సంస్థ కెల్టన్ టెక్ బుధవారం తెలిపింది. అంతర్గత వ్యవహారాల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్న కెల్టన్ టెక్.. వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇటీవలే 10వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న బొకనీ కన్సల్టింగ్.. గత ఏడాది దాదాపు 8 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది.

29న విక్రయానికి ఇఐఎల్ వాటా

ముంబయి, జనవరి 27: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఇఐఎల్)లో కేంద్ర ప్రభుత్వం 10 శాతం వాటాను శుక్రవారం విక్రయించనుంది. ఈ అమ్మకంతో ఖజానాకు 690 కోట్ల రూపాయలకుపైగా నిధులు సమకూరుతాయని అంచనా. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఇఐఎల్ వాటాను కేంద్రం విక్రయిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో శుక్రవారం ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఒఎఫ్‌ఎస్ ఉంటుందని ఇఐఎల్ పేర్కొంది. ఆ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ప్రభుత్వరంగ సంస్థల నుంచి రూ. 69,500 కోట్లను సమీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ఇప్పటిదాకా రూ. 12,700 కోట్లే వచ్చాయి.

రూ. 27 వేలకు చేరిన బంగారం ధర

న్యూఢిల్లీ, జనవరి 27: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 380 రూపాయలు పెరిగి 27 వేల స్థాయిని అధిగమించి 27,130 రూపాయల వద్ద స్థిరపడింది. ఫలితంగా మూడు నెలల గరిష్ఠాన్ని తాకినట్లైంది. 99.5 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 26,980 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర కూడా 35 వేల మార్కును దాటింది. 760 రూపాయలు ఎగిసి 35,260 రూపాయలకు చేరింది. పెళ్ళిళ్ల సీజన్ కావడంతో జ్యుయెల్లర్ల నుంచి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు.. దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు విశే్లషించాయి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.07 శాతం పెరిగి 1,119.70 వద్దకు చేరింది.

హెచ్‌డిఎఫ్‌సి లాభం
రూ. 2,419 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 27: దేశీయ మార్ట్‌గేజ్ లెండింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 11.03 శాతం పెరిగి 2,419 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2,179.01 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 12,306.52 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 11,952.48 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, స్టాండలోన్ ఆధారంగా ఈసారి లాభం 1,520.51 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,425.49 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 7,327.69 కోట్ల రూపాయలైతే, అంతకుముందు 6,882.52 కోట్ల రూపాయలు అని బుధవారం హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ స్పష్టం చేసింది.

పవర్‌గ్రిడ్ కార్ప్ లాభం
రూ. 1,613 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 27: పవర్‌గ్రిడ్ కార్ప్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 31 శాతం పెరిగి 1,613.12 కోట్ల రూపాయలుగా నమోదైంది. ట్రాన్స్‌మిషన్ వ్యాపారం నుంచి పెరిగిన ఆదాయమే లాభాల్లో వృద్ధికి కారణం. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో సంస్థ లాభం 1,228.91 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 5,504.83 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 4,486.11 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు పవర్‌గ్రిడ్ వివరించింది. ఇదిలావుంటే 2015 ఏప్రిల్-డిసెంబర్‌లో సంస్థ లాభం 4,427.67 కోట్ల రూపాయలుగా ఉంటే, అంతకుముందు 2014 ఏప్రిల్-డిసెంబర్‌లో 3,566.69 కోట్ల రూపాయలుగా ఉంది.

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి, జనవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 6.44 పాయింట్లు పెరిగి 24,492.39 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 1.60 పాయింట్లు అందుకుని 7,437.75 వద్ద నిలిచింది. ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుండటం.. మదుపరులను ఒత్తిడికి గురిచేసింది. ఫలితంగా పెట్టుబడులకు ముందుకెళ్లలేకపోయారు. నిజానికి చెప్పుకోదగ్గ స్థాయిలో సూచీలు లాభపడినప్పటికీ, చివరిదాకా అవి కొనసాగలేదు. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 24 పైసలు క్షీణించి 68.07కు చేరడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష జరుగుతుండటం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి.

‘వచ్చే నెల ఇండియా ఇనె్వస్ట్‌మెంట్ సదస్సు’

న్యూఢిల్లీ, జనవరి 27: వౌలిక రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వచ్చేనెల రెండు రోజులు ఇండియా ఇనె్వస్ట్‌మెంట్ సదస్సును నిర్వహించనుంది. ఫిబ్రవరి 4-5 తేదీల్లో జరగనున్న ఈ సదస్సులో పలువురు విదేశీ ధీర్ఘకాలిక మదుపరులు పాల్గొననున్నారని బుధవారం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.