బిజినెస్

అమెరికా రియల్టీ మార్కెట్లో భారతీయుల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: అమెరికాలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారతీయులు 800 కోట్ల డాలర్ల పెట్టుబడులతో కెనడియన్లు, చైనీయుల తర్వాత మూడో స్థానంలో నిలిచినట్లు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ గురువారం వెల్లడించింది. అంతేకాకుండా లండన్‌లోని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో దాదాపు 100 కోట్ల పౌండ్ల పెట్టుబడులతో 25 శాతం వాటాను దక్కించుకున్న భారతీయులు గత ఏడాది ప్రథమార్థం నాటికే దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా 200 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారని ఆ సంస్థ స్పష్టం చేసింది. ‘అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఆ దేశంలోని అతిపెద్ద మిలియనీర్ల గ్రూపులో భారతీయులు ఒకరుగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నా. వీరంతా ఇప్పటికే అమెరికాలో స్థిరపడటంతో అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు’ అని సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ప్రెసిడెంట్, సిఇఓ ఫిలిప్ ఎ.వైట్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. 2014 ఆగస్టులో భారత సంస్థ రియల్‌ప్రో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదర్చుకున్న సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ‘నార్త్ ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ’ పేరుతో భారత్‌లో తమ విభాగాన్ని ఏర్పాటుచేసి లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ద్వారా స్థానికులతో పాటు ప్రవాస భారతీయుల అవసరాలను తీరుస్తోంది. అయితే అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్న అంతర్జాతీయ గ్రూపుల్లో భారతీయులు గత ఏడాది 800 కోట్ల డాలర్ల పెట్టుబడులతో కెనడియన్లు, చైనీయుల తర్వాత మూడో స్థానంలో నిలిచారని నార్త్ ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్విన్ చద్ధా వెల్లడించారు.

కోటా సంస్కరణలు
ఎట్టకేలకు అమలు

ఐఎంఎఫ్‌లో భారత్, చైనాలకు
పెరిగిన ఓటింగ్ హక్కులు

వాషింగ్టన్, జనవరి 28: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోటా సంస్కరణలను అమలు చేయడంతో భారత్, చైనా లాంటి బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న దేశాలకు ఇప్పుడు మరిన్ని ఓటింగ్ హక్కులు లభించాయి. మొట్టమొదటిసారిగా ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న నాలుగు దేశాలు-్భరత్, చైనా, బ్రెజిల్, రష్యాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధిలోని అత్యధిక సభ్యులున్న 10 దేశాల జాబితాలో స్థానం లభించింది. ఇదే కాకుండా ఆరుశాతానికి పైగా కోటా వాటాలను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేశారు. దీంతో ఇప్పటివరకు అవసరానికి మించి ప్రాతినిధ్యం ఉన్న ఐఎంఎఫ్ సభ్య దేశాలనుంచి వాటాలు, తక్కువ ప్రాతినిధ్యం కలిగిన దేశాలకు బదిలీ అయినట్లయింది. ఎన్నో సంవత్సరాలుగాఎదురుచూస్తున్న కోటా సంస్కరణలను 2015లో అమెరికా పార్లమెంటు(కాంగ్రెస్) ఆమోదించింది. 2010 కోటా, పరిపాలనా సంస్కరణలను ఐఎంఎఫ్ గవర్నర్ల బోర్డు 2010లో ఆమోదించింది. ఐఎంఎఫ్ మూలధనానికి, పాలనకు సంబంధించి విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే ఈ 14వ జనరల్ కోటా రివ్యూ అమలుకు అవసరమైన షరతులను నెరవేర్చడమైనదని ఐఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. మొట్టమొదటిసారిగా నాలుగు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు(బ్రెజిల్, చైనా, భారత్, రష్యా) ఐఎంఎఫ్‌కు చెందిన అత్యధిక సభ్యులున్న దేశాల జాబితాలో స్థానం లభించిందని బుధవారం విడుదల చేసిన ఆ ప్రకటన తెలిపింది. ఈ సంస్కరణల ఫలితంగా ఐఎంఎఫ్ ఆర్థిక బలం కూడా పెరుగుతుందని, దాని శాశ్వత పెట్టుబడి వనరులు దాదాపురెట్టింపయి 659 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కూడా ఆ ప్రకటన తెలిపింది. 188 దేశాలు సభ్యులుగా ఉన్న ఐఎంఎఫ్‌లో భారత్‌కు ఇప్పుడు 2.34 శాతం ఓటింగ్ హక్కులున్నాయి. కోటాలకు సంబంధించి మన దేశానికి 2.44 శాతం వాటా ఉంది. అత్యధిక సభ్యులున్న పది దేశాల్లో ఈ నాలుగు కాక అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌లున్నాయి.

పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని
తగ్గించుకోనున్న కేంద్రం

అసోచామ్ అంచనా

న్యూఢిల్లీ, జనవరి 28: మార్కెట్లు మందకొడిగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిజినె్వస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించుకోవచ్చని పారిశ్రామిక మండలి అసోచామ్ గురువారం అభిప్రాయ పడింది. ప్రభత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 69,500 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మార్కెట్ల పరిస్థితులు ఆటుపోట్ల మధ్య కొనసాగుతుండడంతో అది డిజినె్వస్ట్‌మెంట్ ప్రణాళికలను జాప్యం చేయక తప్పలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలలు మాత్రమే ఉండగా ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం నాలుగు పిఎస్‌యులలో వాటాలను విక్రయించడం ద్వారా రూ 12,700 కోట్లను మాత్రమే సమకూర్చుకోగలిగింది. వచ్చే ఏడాది కూడా మార్కెట్లలో పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని, అందువల్ల 2016-17 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో పిఎస్‌యులలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకునే నిధులకు సంబంధించిన లక్ష్యాలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించుకోవచ్చని అసోచామ్ పర్కొంది. బహుశా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలను నిర్ణయించుకోవడాన్ని మానుకోవచ్చని అసోచామ్ తన బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నాయి. 2016లో సైతం మార్కెట్లకు ప్రతికూల వాతావరణం కొనసాగడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోనే అవకాశాలు సైతం అంతంతమాత్రంగానే ఉన్నందున ఫైనాన్షియల్ మార్కెట్లు కోలుకుంటాయన్న ఆశలు లేవని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ చెప్పారు.