బిజినెస్

ముంచిన గ్లోబల్ మార్కెట్లు వారాంతపు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 6: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనంతో ఒడిదుడుకులకు లోనైన ఆయా దేశాల స్టాక్ మార్కెట్ల ప్రభావం గడచిన వారం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. మొత్తం ఐదు రోజుల ట్రేడింగ్‌లో మూడు రోజులు సూచీలు నష్టాలకే పరిమితమవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 253.72 పాయింట్లు నష్టపోయి 24,616.97 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 74.45 పాయింట్లు కోల్పోయి 7,489.10 వద్ద స్థిరపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యారెల్ ముడి చమురు ధర 30 డాలర్ల దిగువకు పడిపోవడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జరిపిన ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండడం వంటివి మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. అంతర్జాతీయ అనిశ్చితి, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణత వంటివి కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే విద్యుత్, చమురు, గ్యాస్, రియల్టీ, పిఎస్‌యు, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాల షేర్ల విలువ క్షీణించింది. 5.70 శాతం నుంచి 1.28 శాతం మేరకు పడిపోయాయి. అయినప్పటికీ ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్, టెక్నాలజీ, ఐటి రంగాల షేర్ల విలువ 1.42 శాతం నుంచి 0.28 శాతం పెరిగింది. ఎన్‌టిపిసి, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, గెయిల్, ఎస్‌బిఐ, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ 12.31 శాతం నుంచి 6.06 శాతం తగ్గింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.79 శాతం, స్మాల్-క్యాప్ 2.76 శాతం చొప్పున కోల్పోయాయి. ఇక విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 763.03 కోట్ల రూపాయల పెట్టుబడులను అమ్మేశారు. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 13,846.62 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 84,978.59 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అయతే అంతకుముందు వారం మాత్రం బిఎస్‌ఇ టర్నోవర్ 10,420.61 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 70,348.91 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.