బిజినెస్

ముమ్మరంగా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మాణంలో వున్న 600/2 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో చేపట్టిన నిర్మాణ పనులపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగ సలహాదారు, ఆర్‌పి సింగ్, సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ సంతృత్తి వ్యక్తం చేశారు. బుధవారం సింగరేణి భవన్‌లో ఎస్‌టిపిపి నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. మొదటి యూనిట్‌కు సంబంధించిన బాయిలర్, టిజి డెక్ ప్లోటింగ్ నిర్మాణం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. అదేవిధంగా డిఎం ప్లాంట్‌కు సంబంధించిన రెండు స్ట్రీమ్‌లు, స్టేషనరీ అగ్జిలరీ, కూలింగ్ వాటర్ సిస్టం, లైట్ డిజిల్ ఆయిల్ సిస్టంలు కూడా పూర్తయ్యాయన్నారు. మొదటి యూనిట్‌కు సంబంధించి స్టీమ్ బ్లోయింగ్ నిర్మాణంతో పాటు కీలకమైన మెటీరియల్ సప్లై, కూలింగ్ వాటర్ సిస్టం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనుకున్న సమయానికి పూర్తి చేసి జనవరి కల్లా సింక్రనైజేషన్‌కు సిద్ధం చేయాల్సిందిగా వారు అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 2016నాటికి కమర్షియల్ ఆపరేషన్ చేయాల్సిందిగా వారు ఆదేశించారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ డైరెక్టర్ పి రమేశ్‌బాబు, జిఎం ఎస్ సుధాకర్‌రెడ్డి, ఎన్టీపిసి ఎజిఎం రఘురాం, ఎన్టీపిసి చీఫ్ కో-ఆర్డినేటర్ ఎల్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.