బిజినెస్

నేడో, రేపో చిన్న మొత్తాల పొదుపు వడ్డీ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ : మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో సవరిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. అయితే ఆడపిల్లల, సీనియర్ సిటిజన్ల( వృద్ధులు)కు సంబంధించిన పథకాల వడ్డీ రేట్లను మాత్రం మార్చబోమని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో విడుదలవుతాయని ఆయన చెప్పారు. చిన్న మొత్తాల పొదుపు రేట్లు ప్రభుత్వ సెక్యూరిటీలతో ముడిపడి ఉంటాయని, గతంలో ఏడాదికోసారి వీటిని సవరించే వారని ఆయన అంటూ, ఇప్పుడు వీటిని ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తారని దాస్ చెప్పారు. కొత్త రేట్లు 2016 ఏప్రిల్ 1నుంచి వర్తిస్తాయని కూడా ఆయన చెప్పారు.

బ్రెజిల్ ఎక్స్‌పోకు రండి
ఎంపి సుబ్బారెడ్డికి ఆహ్వానం

ఒంగోలు, ఫిబ్రవరి 11 : బ్రెజిల్ దేశంలో ఏప్రిల్ 30 నుంచి మే 7వ తేదీ వరకు జరిగే ఎపోజబో ఎక్స్‌పోకు హాజరు కావాలని ఆ దేశానికి చెందిన ఎంపి జోష్‌వోటాలియా గురువారం ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి ఆహ్వానాన్ని అందచేశారు. ఒంగోలు జాతి పశుసంతతి అభివృద్ధికి బ్రెజిల్ శాస్తవ్రేత్తలు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందించాలని గత సంవత్సరం నవంబర్ 14న న్యూఢిల్లీలో ఎంపి సుబ్బారెడ్డి బ్రెజిల్ వ్యవసాయశాఖ మంత్రి కాటియాఅబ్రూను కలిసి విన్నవించారు. ఆ మేరకు బ్రెజిల్ ప్రధాని లూయిస్ క్రాడియా ఈ ఎక్స్‌పోకు హాజరు కావాలని ఎంపి సుబ్బారెడ్డికి ఆయన ఆహ్వానం పంపించారు. ఈ ఎక్స్‌పోలో బ్రెజిల్ జాతి సంపద ఎక్యూప్‌మెంట్, శాస్తస్రాంకేతిక ప్రదర్శన జరుగుతుందని ఈ సందర్భంగా ఈ ఎక్స్‌పోకు హాజరుకావాలని బ్రెజిల్ ఎంపి సుబ్బారెడ్డికి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఎంపి సుబ్బారెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ బ్రెజిల్ దేశం భారతదేశానికి ఎంఓయు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ఎక్స్‌పోకు కేంద్ర వ్యవసాయశాఖమంత్రి రాధామోహన్‌సింగ్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులను ఆహ్వానిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.