బిజినెస్

అక్రమ కొనుగోళ్లపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి: అక్రమ పొగాకు కొనుగోళ్లు అరికట్టడానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారి పి రమేష్ పేర్కొన్నారు. అక్రమ కొనుగోళ్ల వల్ల రైతులు నష్టపోవడమేకాక, బోర్డు ఉనికికే ముప్పు ఏర్పడుతోందన్నారు. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలోగల పొగాకు వేలం కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొగాకు అక్రమ కొనుగోళ్లు నియంత్రించడానికి ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలోగల అయిదు పొగాకు వేలం కేంద్రాల్లో రెండేసి బృందాలు ఏర్పాటుచేశామన్నారు. ఎస్‌ఎల్‌ఎస్ ఏరియాలో 14, ఎస్‌బిఎస్ ఏరియాలో 14 బృందాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. బయట అక్రమ కొనుగోళ్లు అరికట్టేందుకు రైతులు పూర్తి సహకారం అందించాలని రమేష్ కోరారు. అక్రమ పొగాకు కొనుగోళ్లు జరిపే వ్యాపారులు, దళారులపై పొగాకు బోర్డు నిఘాపెడుతుందని, పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వ్యాపారుల లైసెన్సులు, రైతుల బ్యారన్ లైసెన్సులను కూడా రద్దుచేస్తామన్నారు. అక్రమ పొగాకు కొనుగొళ్లు వల్ల పొగాకు బోర్డు నిర్వీర్యమవుతుందన్నారు. గత పది సంవత్సరాల నుండి నిఘా వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేస్తోందన్నారు. 2002 నుండి పట్టుబడ్డవారిపై కఠిన చర్యలు తీసుకున్నామని, ఇప్పటి వరకూ 170 కేసులు పెట్టినట్టు తెలిపారు. కొంతమంది వ్యాపారులు, రైతులు పొగాకు బోర్డుకు పూర్తిస్థాయి ఛైర్మన్ లేకపోవడం వల్ల అక్రమ వ్యాపారాలు నిరాటంకంగా సాగుతున్నాయని అపోహతో ఉంటున్నారని, నిఘా వ్యవస్థ పటిష్ఠంగా పనిచేస్తోందన్నారు. తాము ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం, గోపాలపురం, దేవరపల్లి, బందపురం, దర్భగూడెం ప్రాంతాలలో పర్యటించి అక్రమ పొగాకు కొనుగోలుచేసే దళారులను హెచ్చరించామన్నారు. పొగాకు కొనుగోలుచేసే కంపెనీలు కూడా అక్రమ పొగాకు కొనుగోళ్లను ప్రోత్సహించవద్దని రమేష్ కోరారు.