బిజినెస్

డిన్నర్లు, హెలికాప్టర్ రైడ్లకే ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవాన్ని (వాలెంటైన్ డే) చాలామంది రొమాంటిక్ డిన్నర్లు, హెలికాప్టర్ రైడ్‌లతోనే జరుపుకోవాలని భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యనే తమ బడ్జెట్ ఉండాలని చాలామంది అనుకుంటున్నట్లు కూడా ఆ సర్వే పేర్కొంది. దాదాపు 3,000 మంది అభిప్రాయాలతో నియర్‌బై అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఈ సర్వేలో 45 శాతం మంది తమ భాగస్వాములతో రొమాంటిక్ డిన్నర్లకు ఆసక్తి కనబరిచారని, 39 శాతం మంది వ్యక్తిగత బహుమతులకు మద్దతు పలికారని, మరో 18 శాతం మంది ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్‌కు వెళ్తామని చెప్పారని సర్వే నిర్వాహకులు తెలిపారు. 40 శాతం మంది ఈ వాలెంటైన్ డే ఖర్చును 3,000 రూపాయలకు దిగువనే చేస్తామని చెప్పగా, 10 శాతం మంది 5,000 రూపాయలపైనే ఖర్చు చేస్తామని చెప్పారు. ఇక 43 శాతం మంది వాలెంటైన్ డేను తమ ప్రేమను వ్యక్తం చేయడానికి అవకాశంగా అభివర్ణించారని నియర్‌బై సహవ్యవస్థాపకుడు, సిఇఒ అంకుర్ వారికూ తెలిపారు. ఇదిలావుంటే మెట్రో నగరాల కంటే నాన్-మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారే ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఇష్టపడుతున్నట్లు కూడా అంకుర్ చెప్పారు. కాగా, పూలు, ఆభరణాలు, దుస్తులు, మొబైల్స్, వాచీలను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నామని అత్యధికంగా ప్రేమికులు పేర్కొన్నారని అన్నారు.