బిజినెస్

రక్షణ రంగానికి ‘సమీర్’ సాంకేతిక తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రక్షణ రంగంలో జరుగుతున్న ప్రయోగాలకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్) సంస్థ ఎంతగానో ఉపకరించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి విభాగం డైరెక్టర్ బిఎం బవేజా తెలియచేశారు. విశాఖలో 80 కోట్ల రూపాయలతో నెలకొల్పనున్న ఈ కేంద్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బవేజా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్, రిసెర్చ్ రంగంలో సమీర్ కొత్త వరవడిని సృష్టించిందని ఆయన చెప్పారు. ఇప్పటకే ముంబై, చెన్నై, కోల్‌కత్తాల్లో సమీర్ కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. విశాఖతోపాటు, గువాహటిలో ఈ సంస్థ శాఖలను ఏర్పాటు చేయనున్నామని తెలియచేశారు. విశాఖలో 13 ఎకరాల్లో సమీర్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, రెండు ఐటి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కేంద్రం 150 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఇందులో 80 కోట్లతో సమీర్‌ను నెలకొల్పనున్నామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలకు అవసరమైన ఇఎంఐ, ఇఎంసి సదుపాయాలను అందించనున్నామని ఆయన చెప్పారు. ముఖ్యంగా రక్షణ రంగానికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చనున్నామని స్పష్టం చేశారు. డిఆర్‌డిఓ, ఎన్‌ఎస్‌టిఎల్‌లో జరిగిన ప్రయోగ పరీక్షలను సమీర్‌లో చేసుకోడానికి అవకాశం ఉంటుందని, దేశంలోనే సమీర్ తొలి ఆర్ అండ్ డి సంస్థగా గుర్తింపు పొందిందని, విదేశాలు కూడా తమ సంస్థ పనితీరును గుర్తించాయని పేర్కొన్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ, సిస్టమ్స్, ప్రొడక్ట్స్ రంగంలో సమీర్ విశేష సేవలు అందించనుందని బవేజా వివరించారు. ఐటి రంగంలో యువకులకు సమీర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.

విలేఖరులతో మాట్లాడుతున్న బవేజా