బిజినెస్

టిఎస్‌ఆర్టీసికి వెయ్యి కోట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాలని, సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవు దినంగా పరిగణించాలని ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులు ఎస్ బాబు, కె రాజిరెడ్డి, వి మురళీధర్, సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను మంగళవారం సచివాలయంలో కలుసుకొని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తమకు కూడా వర్తింపజేయాలని, భవిష్యత్తులో అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసిలో గూడ్స్ రవాణా వ్యవస్థను చేపట్టేందుకు అనుమతించాలని, డిజిల్‌పై వ్యాట్‌ను పూర్తిగా మినహాయించాలని, అక్రమ రవాణాను అరికట్టాలని వారు ముఖ్యమంత్రికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని, తెలంగాణ ఆర్టీసి బోర్డును ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. అదేవిధంగా టైర్‌మ్యాన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, డీజిల్ కొనుగోలు డీలర్ షిప్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.

హెచ్‌సిఎల్ టెక్ చేతికి
వోల్వో విదేశీ ఐటి వ్యాపారం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశీయ నాలుగో అతిపెద్ద ఐటి సేవల సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్.. వోల్వో గ్రూప్‌నకు చెందిన విదేశీ ఐటి వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే ఈ లావాదేవీల విలువను వెల్లడించేందుకు నోయిడాకు చెందిన సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ అయిన హెచ్‌సిఎల్ నిరాకరించింది. అయినప్పటికీ 895 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్‌లోని ఐటి బిజినెస్‌ను కొనుగోలు చేయడం వల్ల హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఆదాయం మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అల్కార్గో లాజిస్టిక్స్
నికర లాభం రూ. 61 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: అల్కార్గో లాజిస్టిక్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 14.30 శాతం క్షీణించి 61.51 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఈ లాభం 71.78 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,339.2 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,431.7 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ స్పష్టం చేసింది.