బిజినెస్

మార్చి 12 నుండి కాకినాడలో ‘ఆక్వాబిజ్-2016’ అంతర్జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ సాంకేతిక అభివృద్ధి ప్రోత్సాహక సంస్థ (ఎపిటిడిసి) ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మార్చి 12,13,14 తేదీలలో ప్రపంచ స్థాయి ఆక్వా సదస్సు నిర్వహించనున్నారు. ‘ఆక్వాబిజ్-2016’ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఆక్వాబిజ్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఆక్వా రంగ ప్రముఖులు, నిపుణులు, రైతులు పాల్గొంటారు. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొంటాయి. కాకినాడ నగరంలోని జిల్లా క్రీడా మైదానంలో జరిగే ఆక్వాబిజ్-2016 ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారని ఎపిటిడిసి డైరెక్టర్ ఎస్ జ్యోతికుమార్ తెలిపారు. చేపలు, రొయ్యల సాగు, ఇతర సముద్ర ఉత్పత్తులపై తొలిసారిగా ప్రపంచస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాతోపాటు కోస్తాతీరానికి చెందిన చేపలు, రొయ్యల సాగు రైతులు పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఆక్వా రంగంలో ఎదురవుతున్న అనేక సవాళ్ళపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. ఆక్వా రంగంలో ఇటీవలి కాలంలో లాభాల కంటే నష్టాలనే సాగుదారులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆక్వా రంగంలో అధునాతన సాగు పద్ధతులను అవలంభించడం, చేపలు, రొయ్యల పెంపకంలో సాంకేతికతను రైతులకు చేరువ చేయడం, ప్రపంచంలో అనేక దేశాలలో సాగులో వున్న కొత్త వంగడాలను పరిచయం చేయడం, సాగులో మెళుకువలను నేర్పిస్తూ, అధిక లాభాలను ఆర్జించే విధానాలపై తర్ఫీదునిచ్చేందుకు ఆక్వాబిజ్ నిర్వహిస్తున్నారు.