బిజినెస్

వ్యవసాయాభివృద్ధి, ఉపాధి, పేదరిక నిర్మూలనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వ్యవసాయం, ఉపాధి, పేదరిక నిర్మూలన అంశాలపై రాబోయే వార్షిక బడ్జెట్ దృష్టి పెట్టనుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయం త్ సిన్హా తెలిపారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ఈ నెల 29న దీన్ని పార్లమెంట్‌కు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో పేదరిక నిర్మూలన, వ్యవసాయ అభివృద్ధి, యువతకు ఉపాధి లభించేలా పెద్ద ఎత్తున ఉద్యోగ సృష్టిపై దృష్టి పెట్టామని, దీనిపై తీవ్రంగా కసరత్తు చేశామని శనివారం చెప్పారు.
ఐఎమ్‌ఎఫ్ చీఫ్‌గా
రెండోసారి లగార్డే ఎన్నిక
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: క్రిస్టినా లగార్డే మరోసారి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్)కి చీఫ్‌గా ఎన్నికయ్యారు. ఐఎమ్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రస్తుతం లగార్డే కొనసాగుతుండగా, ఆమె పదవీకాలం మరో నాలుగు నెలల్లో ముగుస్తోంది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ఈ పదవికి ఎవరూ పోటీకి రాకపోవడంతో మరో ఐదేళ్లపాటు లగార్డేనే ఐఎమ్‌ఎఫ్ ఎండీగా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది జూలై 5 నుంచి మరో ఐదేళ్లపాటు ఐఎమ్‌ఎఫ్ చీఫ్‌గా లగార్డే కొనసాగుతారని ఓ ప్రకటనలో ఐఎమ్‌ఎఫ్ స్పష్టం చేసింది. అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు, ముఖ్యంగా యూరోజోన్ సంక్షోభం తదితర విపత్కర పరిస్థితులను ఐఎమ్‌ఎఫ్ చీఫ్‌గా లగార్డే ఎదుర్కొన్నారు. 2011లో రేప్ ఆరోపణలతో అప్పటి ఐఎమ్‌ఎఫ్ చీఫ్ డొమినిక్ స్ట్రాస్ ఖాన్ అరెస్టవడంతో ఆయన స్థానంలో లగార్డే వచ్చారు. తర్వాత ఖాన్‌పై ఆరోపణలు తొలగిపోగా, ఐఎమ్‌ఎఫ్‌లోని అంతర్గత సంక్షోభాన్ని జయించి లగార్డే కొనసాగారు.

ఎన్‌హెచ్‌బి లాభం రూ. 375 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బి) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 2.80 శాతం పడిపోయింది. ఈసారి 374.99 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి 385.82 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఆదాయం మాత్రం 5.72 శాతం పెరిగి 2,005.29 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు 1,896.79 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శనివారం సంస్థ ప్రకటించింది. కాగా, నికర నిరర్థక ఆస్తులు క్రిందటిసారితో పోల్చితే 0.27 శాతం నుంచి 0.30 శాతానికి పెరిగాయి.

మారుతికి జాట్ ఆందోళనల సెగ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి శనివారం గుర్గావ్, మనేసర్ ప్లాంట్ల కార్యకలాపాలను నిలిపివేసింది. జాట్ కులస్థుల ఉద్యోగ రిజర్వేషన్ల డిమాండ్ ఆందోళనల మధ్య ప్లాంట్లకు జరగాల్సిన సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అందుకే ఈ ప్లాంట్ల కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చిందని మారుతి సుజుకి ఇండియా అధికార ప్రతినిధి పిటిఐకి తెలిపారు. తిరిగి ప్లాంట్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా చెప్పలేమని అన్నారు. ఈ రెండు ప్లాంట్లలో రోజుకు దాదాపు 5 వేల కార్లు ఉత్పత్తి అవుతాయి.