బిజినెస్

తపాలా శాఖ పెట్టుబడులకు పిఐబి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం తపాలా శాఖ 800 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనకు పబ్లిక్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డు (పిఐబి) ఆమోదం తెలిపింది. అంతేగాక నెల రోజుల్లోపే కేబినెట్ ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లనుంది. ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పిఐబి పరిశీలించి తుది ఆమోదం కోసం కేబినెట్‌కు పంపిస్తుంది. ‘జనవరి 19న జరిగిన పిఐబి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. దీన్ని తుది ఆమోదం కోసం కేబినెట్ వద్దకు పిఐబి సిఫార్సు చేయనుంది.’ అని తపాలా శాఖ సీనియర్ అధికారి ఒకరు పిటిఐకి తెలిపారు. కాగా, పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం తపాలా శాఖ జరుపుతున్న కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరింది. ఆరుగురు కన్సల్టెంట్లతో తుది జాబితాను సిద్ధం చేయగా, ఇందులో ముగ్గురే బిడ్లు దాఖలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న తపాలా శాఖ.. బ్యాంకింగ్ సేవలను అందుకోలేకపోతున్న గ్రామాలు, అక్కడి ప్రజలను లక్ష్యంగా చేసుకుంది. 2017 జనవరి నుంచి పేమెంట్స్ బ్యాంక్ సేవలు మొదలవుతుండగా, మార్చికల్లా పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని తపాలా శాఖ చెబుతోంది.