బిజినెస్

ఇబ్బడిముబ్బడిగా ఆక్వా సాగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరలు భారీగా పలుకుతుండటంతో కోస్తా జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో ఆక్వాసాగు రైతులకు సిరుల వర్షం కురిపిం చడంతో, వేసవికాలంలో మళ్లీ సాగు చేసేందుకు రొయ్య రైతులు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ధరలు లేని సమయంలో వెనుకంజ వేసిన రైతులు, పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండటంతో సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కొంతమంది రైతులు ఈ నెలలోనే రొయ్యల చెరువుల్లో రొయ్య పిల్లలను వదలగా, మరికొంత మంది రైతులు రొయ్యల చెరువులను చదును చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చీరాల, వేటపాలెం, చినగంజాం, ఒంగోలు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, టంగుటూరు, శింగరాయకొండ, ఉలవపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో ఆక్వా సాగును చేపట్టారు. కాగా, వర్షాకాలంలో సాగు చేసిన రైతులకు పంట చేతికందటంతో దాన్ని విక్రయంచే పనిలో పడ్డారు. ధరలు బాగా ఉండటంతో వెంటనే మళ్ళీ సాగుచేసేందుకు సమాయత్తవౌతున్నారు. విదేశీ మార్కెట్‌లో రొయ్యల ధరల విషయానికొస్తే.. 30 కౌంట్ వెనామీ రొయ్య సుమారు ఆరు వందల రూపాయల వరకు ఉండటంతో ఇప్పటికే అమ్మిన రైతులు చెప్పుకోదగ్గ లాభాలనే అందుకున్నారు. భారీగా సాగు చేపట్టిన పారిశ్రామికవేత్తలకైతే కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుండగా, చిన్న, సన్నకారు రైతులకు ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. దీంతో రొయ్యల చెరువులను మరింతగా లీజుకు తీసుకునేందుకు కౌలుదారులు ముందుకు వస్తున్నారు. గతంలో కొంతమంది రొయ్యల చెరువులను నిలిపివేశారు. అలాంటివారు సైతం రొయ్యల సాగును పునరుద్దరిస్తున్నారనే చెప్పవచ్చు. మరోవైపు రొయ్యల ధరలు లేని సమయంలో ఒక్కొక్క రొయ్యపిల్ల 20 పైసల వరకు పలుకగా, ప్రస్తుతం ఆ ధర 40 పైసల వరకు పెరిగింది. దీంతో రొయ్య పిల్లలు ఉత్పత్తిచేసే హేచరీల యజమానులు సైతం లాభాలు గడిస్తున్నారు. నిజానికి ధరలు లేకపోవటంతో హేచరీలను మూసివేద్దామనుకున్నవారికి పెరిగిన ధరలు మళ్ళీ జీవం పోసినట్లైంది. ఇవేరేట్లు కొనసాగితే ఆక్వారంగానికి మళ్ళీ పూర్వవైభవం రానుంది. మొత్తంమీద ఆక్వాసాగు ఇబ్బడిముబ్బడిగా పెరగటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మారకద్రవ్యం భారీగా వచ్చే అవకాశాలున్నాయి.