బిజినెస్

మరో ఐదేళ్లు ఇంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో కదలాడుతున్న నేపథ్యంలో మరో 3-5 సంవత్సరాలు తక్కువగానే ఉండొచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ అంచనా వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ అధినేత అయిన ముకేశ్.. ఆదివారం ఇక్కడ ఓ ప్రముఖ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవిధంగా అభిప్రాయపడ్డారు. ‘ముడి చమురు ధరలు ఏళ్లతరబడి కనిష్ట స్థాయిని తాకుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లోకి పెరిగిన సరఫరాతో ఇలా ధరలు పడిపోవడం ఇదే తొలిసారి.’ అన్నారు. ఈ క్రమంలోనే రాబోయే మూడు, ఐదేళ్ల వరకు చమురు ధరలు తక్కువగానే ఉండొచ్చన్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ముడి చమురు ఉత్పత్తి, ఒపెక్ దేశాల నుంచి అదుపు తప్పిన చమురు సరఫరా ప్రస్తుత ధరల పతనానికి కారణమన్నారు.
ఈ ఏడాది ఆఖర్లో 4జి
4జి టెలికామ్ సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించేందుకు రిలయన్స్ జియో సిద్ధంగా ఉందని, ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో 80 శాతం మొబైల్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది 90 శాతం, ఆపై ఏడాది పూర్తిస్థాయిలో విస్తరిస్తాయని చెప్పారు.
గత ఏడాది డిసెంబర్ ఆఖర్లో రిలయన్స్ వ్యవస్థాపకుడు, ముకేశ్ తండ్రి ధీరుభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకు జియో 4జి సేవలను అందుబాటులోకి తెచ్చినది తెలిసిందే.