బిజినెస్

ఆటో రంగానికి జాట్ల ఆందోళన సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూతబడిన
మారుతి ప్లాంట్లు

న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న జాట్ల ఆందోళన సెగ దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి ఉత్పత్తికి సోమవారం కూడా తగిలింది. గుర్గావ్, మనేసర్‌లలోని ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి ఇంకా మొదలుకాలేదు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల డిమాండ్‌తో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జాట్లు చేస్తున్న ఆందోళన కారణంగా కార్లకు సంబంధించిన ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హర్యానాలో జాట్ల ఆందోళనతో శనివారం నుంచి గుర్గావ్, మనేసర్ ప్లాంట్లలో ఉత్పత్తిని హీరో మోటోకార్ప్.. తాత్కాలికంగా నిలిపివేయగా, మంగళవారం కూడా ఉత్పత్తి మొదలవుతుందో? లేదోనన్నదానిపై ఇప్పటికీ సంస్థ స్పష్టత ఇవ్వలేకపోతోంది. గుర్గావ్, మనేసర్ ప్లాంట్లలో రోజుకు సుమారు 5,000 కార్లు తయారవుతాయని మారుతి సుజుకి తెలియజేసింది.

నిలిచిన
‘హీరో’ ఉత్పత్తి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌నకు చెందిన హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల్లోని ప్లాంట్లలో ఉత్పత్తి, వాహనాల సరఫరా నిలిచిపోయింది. ఉద్యోగ రిజర్వేషన్ డిమాండ్‌తో జాట్లు చేస్తున్న ఆందోళనతో హర్యానాలోని గుర్గావ్, ధరుహెర, రాజస్థాన్‌లోని నీమ్రాన, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ ప్లాంట్లలో ఉత్పత్తి, వాహనాల పంపిణీ వ్యవస్థలు స్తంభించిపోయినట్లు సోమవారం ఓ ప్రకటనలో హీరో మోటోకార్ప్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. జాతీయ రహదారులతోపాటు ఇతర రహదారులు, రైల్వే రవాణాలపై జాట్ల ఆందోళన ప్రభావం భారీగా కనిపిస్తున్నది తెలిసిందే. దీంతో ప్లాంట్లలో తయారైన వాహనాలు బయటకి వెళ్లడం లేదు. తద్వారా ఉత్పత్తి నిలిచిపోగా, ఈ నాలుగు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 81 లక్షల యూనిట్లు.