బిజినెస్

నేడే ఎన్‌టిపిసి వాటా విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద విద్యుదుత్పత్తి సంస్థ, ప్రభుత్వరంగానికి చెందిన ఎన్‌టిపిసిలో 5 శాతం వాటాను మంగళవారం కేంద్ర ప్రభుత్వం విక్రయానికి తెస్తోంది. ఒక్కో షేర్ 122 రూపాయలుండగా, ఈ వాటా అమ్మకంతో 5,029 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అందుకోనుంది. మొత్తం 41.22 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలు చేసే అవకాశం ముందుగా సంస్థాగత మదుపరులకు, తర్వాత రిటైల్ మదుపరులకు దక్కనుంది. దీంతో మంగళవారం సంస్థాగత మదుపరుల నుంచి, బుధవారం రిటైల్ మదుపరుల నుంచి బిడ్లు దాఖలవనున్నాయి. ఈ రెండు రోజులు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బిడ్లను స్వీకరిస్తారు. కాగా, సోమవారం ఎన్‌టిపిసి షేర్ విలువ 126.85 వద్ద ముగియగా, ఈ వాటా విక్రయానికి పెట్టిన షేర్ విలువ దీనికి 3.82 శాతం తక్కువ. ఎన్‌టిపిసిలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 74.96 శాతం వాటా ఉండగా, 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా వాటాను విక్రయించారు. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో 5 శాతం వాటా అమ్మకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో వాటా విక్రయానికి వచ్చిన ఆరో ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టిపిసి. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్, లండన్, అమెరికాల్లో ఈ వాటా విక్రయానికి సంబంధించి విదేశీ మదుపరులను ఆకర్షించడానికి పెట్టుబడుల ఉపసంహరణ శాఖ రోడ్‌షోలనూ నిర్వహించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇఐఎల్, ఐఒసి, పిఎఫ్‌సి, ఆర్‌ఇసి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లలో ప్రభుత్వం వాటాలను అమ్మేయగా, వీటి ద్వారా ఖజానాకు 13,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా 69,500 కోట్ల రూపాయల నిధులను అందుకోవాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగలేకపోతోంది.