బిజినెస్

బేగంపేటలో ఇండియా ఏవియేషన్ 2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో వచ్చే నెల 16 నుంచి 20 వరకు ఇండియా ఏవియేషన్ 2016ను నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ 5వ అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్, అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ తెలిపారు. బుధవారం సచివాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబేతో కలిసి రాజీవ్‌శర్మ ఏవియేషన్ 2016 ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ అంతర్జాతీయ సివియే ఏవియేషన్ ప్రదర్శన ఈసారి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా రాజీవ్ శర్మ సమీక్ష వివరాలను వెల్లడించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బేగంపేట విమానాశ్రయంలో ఈ ఏవియేషన్ ప్రదర్శనను ప్రారంభిస్తారని తెలిపారు. మార్చి 17న పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అంతర్జాతీయ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు. ఇండియా ఏవియేషన్ 2016 ప్రదర్శనలో ఎ 380, ఎ 350, ఎయిర్‌బస్ 747, ఎయిర్‌బస్ 800, బోయింగ్, దస్సాల్ట్, గల్ఫ్ స్ట్రీమ్, టెక్స్‌ట్రాన్ విమానాలు, అగస్టా వెస్ట్‌లాండ్, బెల్, రష్యన్ హెలికాప్టర్లు పాల్గొంటాయన్నారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలకు చెందిన 25 మందిగల డెలిగేషన్ వస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. గ్లోబల్ కంపెనీల సిఇఓలు, విమానయాన సంస్థలు, ఎంఆర్‌ఓలు, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ దారులు, మేజర్ ఇంజిన్ తయారీ కంపెనీలైన సిఎఫ్‌ఎం, యుటిసి, జిఇలు, కార్గో ప్రతినిధులు పాల్గొంటారని చౌబే తెలిపారు. కాగా, ప్రదర్శనలో రెండుసార్లు ఫ్లయింగ్ డిస్‌ప్లే ఉంటుందని, ప్రదర్శన మొదటి మూడు రోజులు వాణిజ్య ప్రతినిధుల కోసం, చివరి రెండు రోజులు సాధారణ ప్రజలకు ఆహ్వానం ఉంటుందని అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక పోలీసులతోపాటు సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు పటిష్టంగా చేస్తామన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, ఫైర్, స్వాగత తోరణాలు, పార్కింగ్ ఏర్పాట్లు, రోడ్ల మరమ్మతులు, హోర్డింగ్స్ ఏర్పాటు, విపత్తు నిర్వహణ ప్రణాళిక, టూరిజం ప్రమోషన్ తదితర అంశాలపై సమీక్షించి సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేయాలని అన్నారు. ఏవియేషన్ 2016 నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వానికి గర్వకారణమని సిఎస్ రాజీవ్ శర్మ ఈ సందర్భంగా చెప్పారు. బందోబస్తు నమూనా ప్రణాళిక, ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు తగిన ఏర్పాట్లు, మెట్రో రైలు నిర్మాణం వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.