బిజినెస్

జీ మీడియా చేతికి ఇండియా టుడే సంస్థల వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇండియా టుడే గ్రూప్‌లోని ఈ-కామర్స్, టివి షాపింగ్ సంస్థల్లో జీ మీడియా కార్పొరేషన్ 80 శాతం వరకు వాటాలను కొనుగోలు చేస్తోంది. నష్టాల్లో నడుస్తున్న టుడే మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, టుడే రిటైల్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో 165.78 కోట్ల రూపాయలతో జీ మీడియా వాటాలను కొంటోంది. రాబోయే నాలుగేళ్లకుపైగా కాలంలో విడతలవారీగా ఈ వాటాలను దక్కించుకోనుండగా, ఇందుకు తమ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జీ మీడియా కార్పొరేషన్ వెల్లడించింది.