బిజినెస్

బడ్జెట్‌లో ఊతం లభించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న 2016-17 సార్వత్రిక బడ్జెట్ వైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాయి. మున్ముందు దేశంలోని ఈక్విటీ మార్కెట్ల గతిని నిర్ధేశించనున్న ఈ బడ్జెట్ దలాల్ స్ట్రీట్‌లో కొత్త వెలుగులు నింపుతుందని పెట్టుబడిదారులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారని, మార్కెట్ గమనం ప్రధానంగా కేంద్ర బడ్జెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలపైనే ఆధారపడి ఉండటమే ఇందుకు కారణమని ‘క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్’ లిమిటెడ్ సిఇఓ రోహిత్ గదియా స్పష్టం చేశారు.
ఆటోమొబైల్ సంస్థలు వచ్చే వారం తమ అమ్మకాల గణాంకాలను ప్రకటించనున్న నేపథ్యంలో ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో ఆ రంగానికి చెందిన షేర్ల జోరు కొనసాగనుంది. అలాగే ఈ వారం విడుదల కానున్న సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల పిఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు కూడా స్టాక్ మార్కెట్ల ధోరణిపై ప్రభావం చూపనున్నాయి.
పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కొన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని అందరూ ఆశిస్తుండటంతో ప్రస్తుతం మార్కెట్ భాగస్వాములంతా కేంద్ర బడ్జెట్ వైపే చూస్తున్నారని ‘ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్’ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా తెలిపారు.
ఇదిలావుంటే, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం వలన ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 నుంచి 7.5 శాత వరకు వృద్ధిరేటు సాధిస్తుందని సార్వత్రిక బడ్జెట్‌కు ముందు నిర్వహించిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కాగా, సోమవారం అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మున్ముందు స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్ధేశిస్తుందని ‘జియోజిట్ బిఎన్‌పి పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ లిమిటెడ్ ఫండమెంటల్ రీసెర్చ్ విభాగ అధిపతి వినోద్ నాయర్ అన్నారు.
‘ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో తీవ్ర గందగోళం, ఫోరెక్స్ రేట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. అలాగే ముడి చమురు ధరలు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పతనమయ్యాయి. ఇటువంటి తరుణంలో అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్న 2016-17 సార్వత్రిక బడ్జెట్ వైపు మేమంతా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు సాఫీగా ముందుకు సాగేందుకు వీలుకల్పించే విధంగా ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా నిర్ధిష్టమైన రోడ్ మ్యాప్‌ను నిర్ధేశిస్తుందని ఆశిస్తున్నాం’ అని వెల్త్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ ‘బొనాంజా పోర్ట్ఫోలియో’ లిమిటెడ్ అధిపతి అచిన్ గోయల్ స్పష్టం చేశారు.
chitram...
ఆర్థిక శాఖ కార్యాలయంలో ఆదివారం ఉన్నతాధికారులతో కలసి బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న అరుణ్ జైట్లీ