బిజినెస్

వౌలిక రంగాలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి, వౌలికాభివృద్ధికి పెద్దపీట వేశారు. వౌలిక రంగానికి 2.21 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. వృద్ధిరేటు బలోపేతంలో భాగంగా ఈ కేటాయింపులని స్పష్టం చేశారు. అయితే కార్పొరేట్ పన్నుపై పారిశ్రామిక, వ్యాపార రంగాల అంచనాలను మాత్రం బడ్జెట్ అందుకోలేకపోయింది. దీనిపై ఆయా రంగాల ప్రముఖులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 30 శాతం నుంచి 29 శాతానికి దించడం సరికాదన్నారు. కానీ ఉత్పాదక రంగంలో కొత్త సంస్థలకు కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించడాన్ని స్వాగతించారు. అయితే స్టార్టప్‌లకు పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భారత తూర్పు, పశ్చిమ తీరాల్లో కొత్త పోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన జైట్లీ.. సెక్యూరిటీస్ అప్పెలెట్ ట్రిబ్యునల్‌లో ధర్మాసనాలను పెంచడానికి వీలుగా సెబీ చట్టలో సవరణలను ప్రతిపాదించారు. మార్కెట్‌లో సామాన్య మదుపరుల రక్షణార్థం పోంజీ పథకాలకు చెక్ పెట్టడానికి సమగ్రమైన సెంట్రల్ లాను కూడా ప్రతిపాదించారు. మరోవైపు టెలికామ్ శాఖకు 18,413 కోట్ల రూపాయలను కేటాయించిన జైట్లీ.. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు 1,713 కోట్ల రూపాయాల సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు 25,000 కోట్ల రూపాయల నిధులను అందిస్తామని చెప్పగా, నల్లధనం వెలికితీతలో భాగంగా 4 నెలల కంప్లియెన్స్ విండోను తెస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 3,000లకుపైగా జన్ ఔషధ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ముందుకురాగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిస్‌ఇనె్వస్ట్‌మెంట్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్‌గా పేరు మారుస్తామని ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా రైతులకు ఎరువుల సబ్సిడీని నగదు బదిలీ పథకం ద్వారా అందిస్తామని కూడా స్పష్టం చేశారు. జిడిపిలో ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన బీమా, పెన్షన్, ఎఆర్‌సి, స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను సరళతరం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, గత ఏడాదికిపైగా కాలం నుంచి అంతకంతకూ క్షీణిస్తున్న ఎగుమతులను ప్రోత్సహించేలా మద్దతిస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.
బలమైన ఆర్థిక శక్తి భారత్: జైట్లీ
భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత శక్తిని, పుష్ఠిని అనేక రీతుల్లో చాటుకుందని తన బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగుతున్నప్పటికీ బలమైన ఆర్థిక పునాదులు కలిగిన భారత్ మాత్రం స్థిరంగా నిలబడగలిగిందన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ను ఒకటిగా పేర్కొందన్న జైట్లీ.. తమ ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో సాధించిన విజయాలను వెల్లడించారు.